S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/08/2017 - 05:09

హైదరాబాద్, మార్చి 7:కరీంనగర్ రూక్మాపూర్ లెదర్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేయిస్తామని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ తెలిపారు. రుక్మాపూర్ లెదర్ పార్క్‌ను కాంగ్రెస్ హయంలో రద్దు చేశారని, ఇప్పుడు వాళ్లే ఆందోళన చేస్తున్నారని ఎంపి తెలిపారు. ఇప్పుడు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే లెదర్‌పార్క్ రద్దు చేశారని చెప్పారు.

03/08/2017 - 05:09

మహబూబ్‌నగర్, మార్చి 7: రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటే రాళ్ల ప్రజలు కొట్టే రోజులు వస్తాయని, అప్పుడు ఎవరూ బాధ్యులు కారని టిఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత, మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీల నేతలను హెచ్చరించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి తన స్వగృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

03/08/2017 - 04:55

హైదరాబాద్, మార్చి 7: పదవులు, హోదాలు పక్కన పెట్టారు. విజిల్స్ వేశారు, క్యారమ్స్ అడారు ఆట పాటలతో గడిపారు. ఎంపి, జడ్‌పి చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు అందరూ ఆటపాటలతో గడిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కనిపించిన దృశ్యం. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా నాయకులంతా రెండు జట్లుగా విడిపోయి తాడును లాగే ఆట ఆడారు. కవిత విజిల్ ఊది ఉత్సాహ పరిచారు.

03/08/2017 - 04:53

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్ర శాసనమండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బందోబస్తులో ఉండే పోలీసులు మర్యాదకరంగా వ్యవహారించాలని శాసనసభ సభాపతి ఎస్.మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం స్పీకర్‌తో పాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

03/08/2017 - 04:50

హైదరాబాద్, మార్చి 7: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిజెపి కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మిక శాఖలో అవినీతి నిర్మూలన కోసం కొత్త చట్టాలను తీసుకువస్తామని చెప్పారు.

03/08/2017 - 04:49

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్రంలో భూముల ధరలు సవరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ హైకోర్టుకు మంగళవారం తెలిపింది. భూ సేకరణ కోసం భూముల ధరలు సవరించడం లేదని మాజీ ఎమ్మెల్యే కె కోదండరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమేష్ రంగనాథన్, జస్టీస్ ఎ శంకర్‌నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిల్‌ను విచారించింది.

03/08/2017 - 04:48

హైదరాబాద్, మార్చి 7: పాకిస్తాన్‌లో ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్న తన కూతురు మొహమ్మదీ బేగంను విడిపించాలని ఆమె తండ్రి హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అక్బర్ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. తన కూతురు మొహమ్మదీ బేగం మస్కట్, ఒమన్ దేశాల్లో పనిచేసినప్పుడు ఒమన్ దేశానికి చెందిన మహమ్మద్ యూసుఫ్‌ను పెళ్లి చేసుకుంది.

03/08/2017 - 04:47

హైదరాబాద్, మార్చి 7: పాఠశాల విద్యకు రానున్న బడ్జెట్‌లో 20వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కోరినట్టు తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, ప్రధానకార్యదర్శి ధనసిరి ప్రకాశ్‌లు పేర్కొన్నారు. అనేక విద్యావసరాలు ఉన్నాయని, ఈ క్రమంలో వాటిని తీర్చేందుకు బడ్జెట్‌లో 20వేల కోట్లు కేటాయించాలని కోరారు.

03/08/2017 - 04:47

హైదరాబాద్, మార్చి 7: ఉపాధ్యాయ శాసనమండలి (హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్) అభ్యర్థి ఎన్నికల్లో ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా బిసి అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వలేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం బిసి భవన్‌లో జరిగిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

03/08/2017 - 04:46

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ రాష్ట్రంలో వివిధ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్టస్థ్రాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీగా సహకార శాఖలోని అడిషనల్ రిజిస్ట్రార్‌ను నియమించారు. అలాగే అడిషనల్ కోఆపరేటివ్ ఎలక్టోరల్ అధికాలుగా ఇద్దరు జాయింట్ రిజిస్ట్రార్‌లను నియమించారు.

Pages