S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/07/2017 - 05:06

హైదరాబాద్, మార్చి 6: రైలు ఢీకొడంతో ఓ మహిళ రెండు కాళ్లు కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఆదివా రం అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డు సమీపంలో పట్టాలు దాటుతున్న మహిళ ప్రమాదవశాత్తున కిందపడిపోయింది. తేరుకుని పైకి లేచే లోపే రైలు వచ్చి ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ మహిళ రెండు కాళ్లు తెగిపోయాయి.

03/07/2017 - 05:05

హైదరాబాద్, మార్చి 6: ఇంటర్మీడియట్ పరీక్షల వేళ కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడానికి కారణం లీకేజీ నివారించడమేనని బోర్డు కార్యదర్శి అశోక్ వివరణ ఇచ్చారు. అందరు విద్యార్ధులకు సమన్యాయం, నీతి, నిజాయితీగా పరీక్షలు రాయడానికి విద్యార్ధుల శ్రేయస్సు కోసం దోహదం చేసేందుకే ఈ చర్యను తీసుకున్నామని అన్నారు.

03/07/2017 - 05:04

నల్లగొండ, మార్చి 6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి తిరుకల్యాణోత్సవం, వైభవోత్సవ కల్యాణోత్సవాలు సోమవారం వైష్ణవ పంచరాత్ర ఆగమశాస్త్రానుసారం సంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు.

03/07/2017 - 05:04

హైదరాబాద్, మార్చి 6: అధికారులు ఇష్టానుసారం తమ ప్రయోజనాల కోసం అధికారాలను దుర్వినియోగం చేయడం తగదని జస్టిస్ పి వి సంజయ్‌కుమార్, జస్టిస్ అనిస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నాడు వ్యాఖ్యానించింది. ఆయుష్ విభాగంలో లెక్చరర్‌గా మారిన తర్వాత తిరిగి డాక్టర్‌గా అధికారులు నియమించారని పేర్కొం టూ డాక్టర్ కోవి శ్రీహరి దాఖలు చేసి న పిటీషన్‌ను బెంచ్ విచారించింది.

03/07/2017 - 04:38

హైదరాబాద్, మార్చి 6: రాష్ట్రంలో ఈసారి కంది పంట బాగా పండిందని, కందుల కొనుగోలు నిలిపివేయవద్దని ఎఫ్‌సిఐ ఎండిని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఎఫ్‌సిఐ ఎండి త్రిపాఠికి హరీశ్‌రావు సోమవారం ఫోన్ చేసి రాష్ట్రంలో కందుల దిగుబడిని వివరించారు. ఈ సారి పంట బాగా పండిందని, దిగుబడి ఎక్కువగా వచ్చిందని చెప్పారు. ఎఫ్‌సిఐ కొనుగోలు కేంద్రాలను అర్ధాంతరంగా మూసివేసే ఆలోచన మానుకోవాలని చెప్పారు.

03/07/2017 - 04:35

హైదరాబాద్, మార్చి 6: టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం సమావేశం ఈనెల తొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ భవన్‌లో జరుగుతుంది. శాసన సభ, శాసన మండలి సభ్యులతో పాటు ఎంపిలు హాజరవుతారు. ఈనెల 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో తొమ్మిదిన టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం ఏర్పాటు చేశారు.

03/07/2017 - 04:32

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ సర్వశ్రేయోనిధి (సిజిఎఫ్) నుండి 2017-18 సంవత్సరానికి వివిధ పనులకోసం 65 కోట్ల రూపాయలు కేటాయించాలని సిజిఎఫ్ కమిటీ నిర్ణయించింది. ఎండోమెంట్స్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన సిజిఎఫ్ కమిటీ సోమవారం ఇక్కడి దేవాదాయ శాఖ కార్యాలయం (్ధర్మిక భవన్) లో సమావేశమై వివిధ తీర్మానాలను చేసింది.

03/07/2017 - 02:26

హైదరాబాద్, మార్చి 6: ఆర్థిక స్వావలంబనతోనే మహిళల వికాసం సాధ్యమవుతుందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య కూడా మహిళల వల్ల రూపుమాసే అవకాశం ఉందని అన్నారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో బ్రిటీష్ కౌన్సిల్- యాజియో సంయుక్తంగా సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాయి.

03/07/2017 - 02:24

హైదరాబాద్, మార్చి 6: ఆర్మూర్- ఆదిలాబాద్‌ల మధ్య రైల్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్వరలోనే అవగాహనా ఒప్పందం కుదురుతుందని, ఆ వెంటనే పనులు ప్రారంభం అవుతాయని రైల్వే జిఎం వెల్లడించారు. పనులు ప్రారంభించిన మూడేళ్లలో పూర్తవుతాయి. ఆర్మూర్- ఆదిలాబాద్‌ను హైదరాబాద్‌తో అనుసంధానించే ఈ ప్రాజెక్టు కోసం ప్రజలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు.

03/07/2017 - 02:22

హైదరాబాద్, మార్చి 6: కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బిసి గురుకుల విద్యాలయాలను తీర్చి దిద్దనున్నట్టు బిసి సంక్షేమ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలో వెనుకబడిన తరగతుల విద్యాలయాల సంస్థ పాలక మండలి సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 119 బిసి గురుకులాలు ప్రారంభం అవుతాయని చెప్పారు.

Pages