S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/05/2017 - 03:51

హైదరాబాద్, మార్చి 4: పోలీసు ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మెదక్ జిల్లా దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్‌తోకాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. తెలంగాణ పోలీసు శాఖలో కింది ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు అధికమయ్యాయని అన్నారు.

03/05/2017 - 03:50

హైదరాబాద్, మార్చి 4: పదవీవిరమణ చేసే దశలో నచ్చిన వారికి పదవీకాలాన్ని పొడిగించుకుంటూ పోతే పదవీవిరమణకు దగ్గరపడిన వారికి పదోన్నతుల సంగతి ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీరును బిజెపి నిలదీసింది. రిటైర్డు ఉన్నతాధికారులను సలహాదారులుగా నియమించడం, పదవీకాలాన్ని పొడిగించడం కారణంగా మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని బిజెపి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పేర్కోన్నారు.

03/05/2017 - 03:49

హైదరాబాద్, మార్చి 4: మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు వెనకాడమని ఆర్‌డబ్ల్యుఎస్ ఇఎన్‌సి సురేందర్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ టేయిల్ పాండ్ భగీరథ పనులను శనివారం సురేందర్ రెడ్డి తనిఖీ చేశారు. సూర్యాపేట (ఇమామ్ పేట) 95 మిడ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం పనులు నెమ్మదిగా జరగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

03/05/2017 - 03:16

చిగురుమామిడి, మార్చి 4: అంతర్జాతీయ మహిళ సదస్సుకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి సర్పంచ్ అందె స్వప్న-చినస్వామి ఎంపికయ్యరు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఈనెల 7, 8వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన జాతీయ మహిళ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

03/05/2017 - 03:14

సిద్దిపేట, మార్చి 4 : ఆత్మహత్యకు పాల్పడిన ఎస్‌ఐ చిట్టిబాబు, అతని భార్య భౌతికకాయాలకు శనివారం తిరుమలగిరి (సికిందరాబాద్)లోని లోతుకుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, పోలీస్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి తదిరులు పాల్గొని నివాళులర్పించారు.

03/05/2017 - 03:12

తాండూరు, మార్చి 4: తాండూరు మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ముగియడంతోగత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న అయోమయ, గందరగోళ పరిస్థితులకు తెరదించినట్టయింది.

03/05/2017 - 03:08

నిజామాబాద్, మార్చి 4: తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు. పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులను తప్పుదోవ పట్టించి ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

03/05/2017 - 03:06

నల్లగొండ, మార్చి 4: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శనివారం ఉగ్రనృసింహుడు గోవర్ధనధారి అలంకారం సేవలో సింహవాహన రూఢుడై భక్తులకు దర్శనమిచ్చాడు.

03/05/2017 - 03:04

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 4: ఉగాది పర్వదినం మార్చి 28నా, 29నా అనే మీమాంసలో పండితులు పురోహితులు ఉన్నారని దృగ్గణిత పంచాంగం ప్రకారం మార్చి 28నే ఉగాదిని నిర్వహించాలని లక్కావఝల సుబ్రమణ్య సిద్ధాంతి స్పష్టం చేశారు.

03/05/2017 - 02:15

హైదరాబాద్, మార్చి 4: అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ ఎబివిపి నేతలు శనివారం నాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను కలిసి వినతి పత్రం సమర్పించారు.

Pages