S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/05/2017 - 02:14

హైదరాబాద్, మార్చి 4: బిసిలకు కావాల్సింది నాణ్యమైన విద్య గానీ గొర్రెలు, పందులు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వృత్తుల వారీగా బిసిలను విడగొట్టి వారిని అదే వృత్తులకు పరిమితం చేస్తూ, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు దూరం చేయాలనే ఆలోచన కెసిఆర్ ప్రభుత్వానికి సరికాదని అన్నారు.

03/05/2017 - 02:13

హైదరాబాద్, మార్చి 4: మనుషుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలసి పనిచేయాలని ఆయన సూచించారు.

03/05/2017 - 02:13

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోయిందని, అగమ్య గోచరంగా ఉన్నందున పార్టీలో ఎవరేం రాసిచ్చినా దిగ్విజగ్ సింగ్ స్క్రిప్ట్ చదవి వెళ్లిపోతున్నారని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ భవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాసిచ్చింది చదవడం కాదు, ఆచరణలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అన్నారు.

03/05/2017 - 02:12

హైదరాబాద్, మార్చి 4: బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డికి సూచించారు. మిడిమిడి జ్ఞానం, అరకొర సమాచారంతో తరచూ అబద్దాలను చెబుతూ అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా, ప్రజలు విశ్వసించరని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

03/05/2017 - 02:12

హైదరాబాద్, మార్చి 4: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ఆ లోగా జివో నెం.14 ప్రకారం వేతనాలు పెంచాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

03/05/2017 - 02:11

హైదరాబాద్, మార్చి 4: కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్‌ఐ), ఆర్‌సిఐ (డిఆర్‌డిఓ), నెట్‌యాప్‌తో భాగస్వామ్యం చేసుకుని ‘ట్రెండ్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ నెక్ట్స్ జనరేషన్ ఐసిటి’పై అంతర్జాతీయ సదస్సు 2017ను నిర్వహించాయి. కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేటిక్స్ రంగంలో పరిశోధనకారులు, శాస్తవ్రేత్తలు, డెవలపర్లు, ప్రాక్టీషనర్లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఓ వేదికగా నిలిచింది.

03/05/2017 - 02:11

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి-కృష్ణానదీ జలాలను వినియోగించుకునే ఉద్దేశ్యంతో రీ డిజైనింగ్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన పనులపై వాస్తవాలను చర్చించుకునేందుకు గాను వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల తరఫున పశ్యపద్మ ఒక ప్రకటనలో తెలిపారు.

03/05/2017 - 02:09

హైదరాబాద్, మార్చి 4: బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన కుమారుడు ఖగేంద్ర రామానుజారెడ్డి 15వ జన్మదినోత్సవం సందర్భంగా 17 లక్షల రూపాయిలతో తయారుచేయించిన బంగా శఠారిని ఈ నెల 7వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వరస్వామికి సమర్పించనున్నారు. 7వ తేదీ ఉదయం 6 గంటలకు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుని ఈ శఠగూపాన్ని అందిస్తారని తెలిసింది.

03/05/2017 - 01:16

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో ఆనాడు బాంచెన్ దొర, నీ కాలు మొక్కుతా అనే దారుణ పరిస్థితులకు స్వస్తి పలికి ప్రజలకు స్వేచ్ఛను కలిగించింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఎపి అసెంబ్లీ భవన ప్రారంభ సమయంలో చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని దురుద్ధేశపూర్వకంగా పెడర్థాలు తీస్తూ కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు.

03/05/2017 - 01:11

హైదరాబాద్, మార్చి 4: పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శనివారం ప్రగతి భవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ ముఖ్యమంత్రికి భగవద్గీత బహూకరించారు. కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

Pages