S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/04/2017 - 04:01

హైదరాబాద్, మార్చి 3: ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో తలపెట్టిన వాణిజ్య, రెసిడెన్షియల్ ఇళ్లతో పాటు ఎల్‌ఐజి వారికి నిర్మించి ఇవ్వాలనే ఒప్పందాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది. 2002 నుంచి 2014 వరకు చేపట్టిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. వాటిని వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించారు.

03/04/2017 - 03:59

హైదరాబాద్, మార్చి 3: దేశంలో తొలి సారిగా 75శాతం సబ్సిడీతో ఎరుకల వారికి పందులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో లక్షా 20వేల ఎరుకల కుటుంబాలు ఉన్నాయి. వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం సబ్సిడీతో పందులను ఇవ్వాలని నిర్ణయించినట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

03/04/2017 - 03:58

హైదరాబాద్/ గచ్చిబౌలి, మార్చి 3: విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి సుమారు 250 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వాసవీ కళాశాల నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సిపి మహేశ్ భగత్ తెలిపారు. వనస్థలిపురం వాసవీ జూనియర్ కళాశాలకు చెందిన వై.

03/04/2017 - 03:54

హైదరాబాద్, మార్చి 3: వెనుకబడిన తరగతుల (బిసి)లో అత్యంత వెనుకబడిన కులాల (ఎంబిసి) ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఫైల్‌పై సంతకం చేశారు.

03/04/2017 - 03:54

హైదరాబాద్, మార్చి 3: ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) ఆధ్వర్యంలో హైదరాబాద్ (బేగంపేట) టూరిజం ప్లాజాలో ‘ట్రైబ్స్ ఇండియా’ పేరుతో ట్రైబల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కొన్ని పెయింటింగ్స్‌ను కొనుగోలు చేస్తామని వెంకటేశం హామీ ఇచ్చారు.

03/04/2017 - 02:43

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ శాసన మండలి హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానానికి సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ అధికారికంగా ప్రకటించారు. అంతేగాక, ఆయన ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేశారు. ఎమ్మెల్సీ స్థానానికి అధికార టిఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా జాఫ్రీ ఒకే ఒక్కడు నామినేషన్ దాఖలు చేశారు.

03/04/2017 - 02:41

హైదరాబాద్, మార్చి 3: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక, పని ఒత్తిడితో యువ ఎస్‌ఐలు, పోలీసులు సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని తనువు చాలిస్తున్నారు. ఆరు నెలల్లో ఐదుగురు పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం పోలీసు శాఖను, పోలీసుల కుటుంబాలను కలవరపరుస్తున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సొంత జిల్లా (పాత మెదక్)లోనే మూడు సంఘటనలు జరిగాయి. తాజాగా కరీంనగర్‌లో ఒకటి, ఆదిలాబాద్‌లో రెండు ఘటనలు జరిగాయి.

03/04/2017 - 02:39

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణలో ప్రాజెక్టుల వ్యయ అంచనాలను ఇష్టానుసారంగా ప్రభుత్వం పెంచుతోందని ఎఐసిసి ప్రధానకార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ప్రాజెక్టుల్లో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రాజెక్టులను అడ్డుకుంటోందంటూ సిఎం కెసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

03/04/2017 - 02:36

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలో కందుల కొనుగోలుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను ఈ నెల చివరి వరకు కొనసాగించాలని రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హర్జీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ పర్యాయం కందిపంట బాగా పండిందని గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కు రైతుల నుండి కందులను కొనుగోలు కొనసాగించాలని కోరారు.

03/04/2017 - 02:35

హైదరాబాద్, మార్చి 3: ఒకటా, రెండా అమ్మో ప్రపంచ దేశాల్లో ఏకంగా 50 వేల న్యూక్లియర్ బాంబులు ఉన్నాయట. వీటిలో ఏ 500 పేలినా, వాడినా మొత్తం భూ ప్రపంచంపై మానవులే కాదు పశు-పక్ష్యాదులు, చెట్లు, చీమ సర్వనాశనం అయిపోతుందని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రపంచ దేశాలు న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకోవడం క్షేమకరం కాదని అన్నారు.

Pages