S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/04/2017 - 02:35

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నుండి ‘మొక్కుల డబ్బులు’ రికవరీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలంటూ సామాజిక కార్యకర్తలు కంచె ఐలయ్య, జి. రాములు హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు చెల్లించుకుంటానని కె.

03/04/2017 - 02:34

హైదరాబాద్, మార్చి 3: రానున్న వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయి. ఈ నెల 4 నుంచి 10 వరకు 20 జిల్లాల్లో గరిష్టంగా 34 డిగ్రీల నుంచి 38 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. మరో 11 జిల్లాల్లో 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలకు చేరుకుంటుందని తెలిపింది.

03/04/2017 - 02:33

హైదరాబాద్, మార్చి 3: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బిఎ, బికాం, బిఎస్సీ చదువుతున్న విద్యార్ధుల తొలి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం శనివారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి , కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం కుమార్‌లు పాల్గొంటారు.

03/04/2017 - 02:33

హైదరాబాద్, మార్చి 3: నిరుద్యోగ యువత జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు. ఉద్యోగ ప్రకటనల జారీలో డ్రామాలాడుతూ నిరుద్యోగుల భవిష్యత్తు, జీవన పరిస్థితులను అస్తవ్యవస్థం చేస్తోందని అన్నారు.

03/04/2017 - 00:36

హైదరాబాద్, మార్చి 3: ‘మీ నిర్వాకం, అలసత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది, కోర్టుల్లో ఉన్న మొండి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం లేదు..’ అని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) పర్యాటక, టిఎస్‌ఐఐసి శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

03/03/2017 - 04:57

జహీరాబాద్, మార్చి 2: ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాలం చెల్లిందని, అబద్దాలతో ఎంతోకాలం మనలేరని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజ లు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘జన ఆవేదన’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

03/03/2017 - 04:56

నల్లగొండ, మార్చి 2: ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో సిఎం కెసిఆర్ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి నినాదాలతో తమ్మినేటి చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం సూర్యాపేట జిల్లా సరిహద్దుల నుండి టేకుమట్ల బ్రిడ్జి మీదుగా నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించింది.

03/03/2017 - 04:56

సిద్దిపేట, మార్చి 2 : పేదలకు వైద్యులు సేవా నిరతితో వైద్య సేవలు అందించాలని.. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ఐఎంఎ సమావేశ మందిరంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గర్భిణులకు డెలివరీ నుండి పుట్టిన పాప ఐదేళ్ల వరకు ఆరోగ్య సంరక్షణ - పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టేలా ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు.

03/03/2017 - 04:55

సంగారెడ్డి టౌన్, మార్చి 2: రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదించబోతున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేసా రు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణ అనే అంశాలను ఏకీకృత విధానం ద్వారా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

03/03/2017 - 04:55

హైదరాబాద్/పరిగి, మార్చి 2: ఓ ఎమ్మెల్యే ఓబడుగు ఉద్యోగినిపై ‘‘నేడు ఎమ్మెల్యేరేపు మంత్రిని.. ఆ తరువాత ముఖ్యమంత్రిని అవుతా. నా ఇంటికే కరంట్ కట్ చేస్తావా’’ అంటూ చిందులేశారు. బిల్లును అడిగేందుకు మాత్రమే వచ్చానంటూ లైన్ మెన్ చెబుతున్న సమాధానాన్ని కూడా జీర్ణించుకోలేని సదరు ప్రజాప్రతినిధి పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ తిట్ల పురాణం పెట్టాడు.

Pages