S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2017 - 03:16

హైదరాబాద్ / ఉప్పల్, ఫిబ్రవరి 28: జాబ్ మేళా పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన అద్వితీయ సేవా ఫౌండేషన్ నిర్వాహకులను ఉప్పల్ పోలీసులు అరెస్టుచేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఏసిపి గోనె సందీప్ ఉప్పల్ ఎస్‌ఐ రవికుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అరెస్టు వివరాలు తెలిపారు.

03/01/2017 - 03:11

గరిడేపల్లి, పిబ్రవరి 28 : మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. మృతులిద్దరూ నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని కోదండరామపురం గ్రామానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. జరిగిన సంఘటన ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది.

03/01/2017 - 03:05

హైదరాబాద్, ఫిబ్రవరి 28: హైదరాబాద్‌కు మరో విశ్వవిద్యాలయం రానుంది. కెఎల్ యూనివర్శిటీ తన క్యాంపస్‌ను ఈ విద్యాసంవత్సరం నుండి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్టు సంస్థ ఉపాధ్యక్షుడు హవీష్ లక్ష్మణ కోనేరు చెప్పారు.

03/01/2017 - 03:03

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కాంగ్రెస్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి చేరువై కలిసి ప్రయాణిస్తోంది. టిఆర్‌ఎస్ కూడా అంతే చేరువ అయ్యిందనడానికి తాజాగా శాసనమండలికి (కౌన్సిల్) జరుగుతున్న ఎన్నికలే నిదర్శనం. కౌన్సిల్‌కు స్థానిక సంస్థల (జిహెచ్‌ఎంసి) కోటాలో ఒక స్థానానికి ఖాళీ ఏర్పడింది. మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ జాఫ్రీ పదవీ కాలం ముగియనున్నది.

03/01/2017 - 03:02

హైదరాబాద్, ఫిబ్రవరి 28: పివి నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో (హైదరాబాద్) 10 కీలకపోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన, ఏడు పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంజూరి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో జీఓ ఎంఎస్ నెంబర్ 39 జారీ చేశారు.

03/01/2017 - 03:00

హైదరాబాద్, ఫిబ్రవరి 28:రాష్ట్రంలో రెండు లక్షల యాదవ, కుర్మ కుటుంబాలకు త్వరలోనే కుటుంబానికి 21 గొర్రెలను పంపిణీ చేయనున్నారు. గొర్రెల పెంపకం దారుల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అందజేస్తారు.

03/01/2017 - 03:00

హైదరాబాద్, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధు-మిత్రులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ భౌతికకాయానికి మంగళవారం ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సోమవారం మరణించిన పి. శివశంకర్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించిన సంగతి తెలిసిందే.

02/28/2017 - 04:54

భువనగిరి, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడు తున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విరుచుకుపడ్డారు.

02/28/2017 - 04:54

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 27 : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 33 నెలలు దాటినా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

02/28/2017 - 04:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తెలంగాణ విద్యుత్ శాఖలో మిగిలిన 238 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను మెరిట్ అధారంగా భర్తీ చేయ్యల ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయతే నియామక పత్రాలను మాత్రం ఇప్పుడే ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యుత్ సంస్థలు ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్లు సమర్పించాయి.

Pages