S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/28/2017 - 04:53

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27: తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ చేపట్టిన ఉపవాసదీక్ష ముమ్మటికీ దొంగ దీక్షనేనని, అలాంటి ఆధారాలన్నీ వీడియోతో సహా తన వద్ద సిద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు.

02/28/2017 - 04:51

నల్లగొండ, ఫిబ్రవరి 27: కంది రైతులు మరోసారి రోడ్కెక్కి తమ నిరసన గళం వినిపించారు. సోమవారం నుండి నల్లగొండ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నామంటూ చెప్పి అందుకు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తు కందులను మార్కెట్‌కు తీసుకవచ్చిన రైతులు రాస్తారోకో చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

02/28/2017 - 04:50

సంగారెడ్డి, ఫిబ్రవరి 27: దొంగలు, తాగుబోతులు, అవినీతి పరులకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరి అలాగే ఉందని టి.పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. సోమవారం సంగారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

02/28/2017 - 04:49

నల్లగొండ, ఫిబ్రవరి 27: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 8:45 గంటలకు ఆగమశాస్త్రానుసారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు నేతృత్వంలోని పండిత బృందం స్వామివారి బాలాలయంలో శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివచనాలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

02/28/2017 - 04:24

హైదరాబాద్, ఫిబ్రవరి 27: వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వన్యప్రాణులను రక్షించనున్నట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర వన్యప్రాణుల మండలి సమావేశం జరిగింది. వన్యప్రాణుల చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులను వేటాడే వారి భరతం పడతామని హెచ్చరించారు.

02/28/2017 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 27: గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులు నత్త నడకన సాగడం వల్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31 నాటికి సిసి రోడ్లు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

02/28/2017 - 04:19

హైదరాబాద్, ఫిబ్రవరి 27: వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఒకేసారి 84లక్షల గొర్రెలు రాబోతున్నాయి. ఒక సారి ఇంత పెద్ద మొత్తంలో గొర్రెల పంపిణీ దేశంలో ఇదే మొదటి సారి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోళ్ల కోసం ఇప్పటికే అధికారుల బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఒక అవగాహనకు వచ్చింది. ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లకు 20 శాతం సబ్సిడీ ఇచ్చే వాళ్లు.

02/28/2017 - 04:17

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం పరిధిలో ఉన్న ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన ఉద్యాన రైతుల పంట పండింది. ఈ రెండు గ్రామాల్లో డ్రిప్ ఇరిగేషన్ చేపట్టిన రైతులకు అవసరమైన డ్రిప్ పరికరాలను 100 శాతం సబ్సిడీతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

02/28/2017 - 04:17

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు ఇంటర్ విద్యాశాఖ ‘ఎగ్జామ్ సెంటర్ లొకేటర్’ పేరుతో యాప్‌ను ఆవిష్కరించింది. సచివాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ యాప్‌ను విడుదల చేశారు.

02/28/2017 - 04:14

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలో 2016-17 రబీ సీజన్‌కు సంబంధించి సెనగపంటను కొనుగోలు చేసేందుకు తెలంగాణ స్టేట్ (టిఎస్) మార్క్‌ఫెడ్‌తో పాటు హాకాను నోడల్ ఏజీన్సీలుగా ప్రభుత్వం నియమించింది.

Pages