S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/07/2017 - 04:41

హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాద్‌లో జల్సాలకు అలవాటుపడుతున్న యువకులు నేరస్థులుగా మారిపోతున్నారు. సరదా కోసమంటూ కొందరు, మద్యం వ్యసనంతో మరికొందరు, గర్ల్‌ఫ్రెండ్స్ కోరికలు తీర్చడం కోసం ఇంకొందరు చోరీలకు పాల్పడుతున్నారని ఇటీవల హైదరాబాద్ పోలీసులు, మానసిక నిపుణుల సర్వేలో వెల్లడైంది.

02/07/2017 - 04:41

హైదరాబాద్, ఫిబ్రవరి 6: రాజధాని నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని, ఖాళీ స్థలాల కోసం అనే్వషిస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన తరువాత రెవెన్యూ, మున్సిపల్, జిహెచ్‌ఎంసి అధికారులతో కెటిఆర్ సోమవారం సమావేశం అయ్యారు.

02/07/2017 - 04:40

మెదక్, ఫిబ్రవరి 6: గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్‌కు సంబంధించిన కేసులను సిబిఐకు అప్పగించేది లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మెదక్ వచ్చిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసువ్యవస్థ పటిష్టంగా ఉందని, నేరాల అదుపులో విజయం సాధిస్తోందని అన్నారు.

02/07/2017 - 02:45

హైదరాబాద్, ఫిబ్రవరి 6: జిఆర్‌ఇ, జిమ్యాట్, టోఫెల్, ఐఇఎల్‌టిఎస్ వంటి అంతర్జాతీయ ఎంపిక పరీక్షలకు హాజరయ్యే గిరిజన విద్యార్థులు తగిన శిక్షణ పొందేందుకు వీలు కల్పిస్తూ వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

02/07/2017 - 02:41

హైదరాబాద్, ఫిబ్రవరి 6: నీలోఫర్ ఆసుపత్రిలో బాలింతల మృతితో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల వరుసగా బాలింతలు మృతి చెందటం వివాదాస్పదంగా మారగా తాజాగా ఆదివారం మరో ఇద్దరు మరణించడంతో వారి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్లు చేయడం వల్లే తమవారు మరణించారని ఆరోపిస్తూ వారు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు పూనుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి, తోపులాటకు దిగారు.

02/07/2017 - 03:00

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రపంచ లైఫ్ సెనె్సస్, ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దనున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగానికి మొదటి నుంచీ హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మాసిటీ, ఈ రంగంలో హైదరాబాద్‌ను మరింత సుస్థిర స్థానానికి చేరుస్తుందన్నారు.

02/06/2017 - 05:29

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గొర్రెలకు సంబంధించి యాదవులకు ఉన్న అనుభవం ఐఏఎస్ చదివిన వారికి కూడా ఉండదని ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చమత్కరించారు.

02/06/2017 - 05:28

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5: పాపిష్ఠి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని ఉక్కిరిబిక్కిరి అవుతూ గిలగిలా కొట్టుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తూ తెలంగాణ రైతాంగం పొట్టగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెబుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.

02/06/2017 - 05:27

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఖాజీపేటలో రైలు వ్యాగన్ల వర్క్ షాప్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 185 ఎకరాలు కేటాయిస్తే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఖాజీపేటలో వ్యాగన్ల వర్క్ షాప్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 20 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు.

02/06/2017 - 05:27

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆన్‌లైన్ ప్రకటనలు క్లిక్ చేస్తే లక్షల రూపాయలు ఆదాయం వస్తుందంటూ మోసాలకు పాల్పడిన సోషల్‌ట్రేడ్ సంస్థ హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని వేలాది మంది ఐటి ఉద్యోగులు సుమారు రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.

Pages