S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/05/2017 - 07:07

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణలోని అన్ని దేవాలయాలకు విడివిడిగా ‘ప్రత్యేక పూజా నిధి’ని ఏర్పాటు చేయాలని దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ ఎం.వి.సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డికి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు రోజువారీ పూజకు కూడా నిధులు లేక ఇక్కట్లకు గురవుతున్నాయని గుర్తుచేశారు.

02/05/2017 - 07:06

గోదావరిఖని, ఫిబ్రవరి 4: పని భద్రత... ఆరోగ్య భద్రత... కనీస వేతనాలు... సామ్రాజ్య వాద దోపిడీ విధానాలను ఎదుర్కొంటూ... చట్టబద్ధమైన కార్మిక హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రామిక వర్గమంతా ఐక్యంగా ఉద్యమం చేద్ధామని జర్మనీ, పోలాండ్, పెరు దేశాల కార్మిక సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రపంచ గని కార్మికుల మహాసభలు శనివారంతో 3వ రోజుకు చేరుకున్నాయి.

02/05/2017 - 06:27

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనుమతిస్తూ, సంబంధిత ఉత్తర్వులపై సిఎం కెసిఆర్ శనివారం సంతకం చేశారు. 2017-18 సంవత్సరానికి 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున 240మంది విద్యార్థులతో మొదటి ఏడాది స్కూళ్లు ప్రారంభమవుతాయి. స్కూళ్ల నిర్వాహణకు 3570మంది ఉద్యోగుల నియామకానికీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

02/05/2017 - 06:26

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ముఖ్యమంత్రి నేతృత్వంలోని అఖిలపక్ష బృందానికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం రద్దు చేసింది. 6న అఖిలపక్ష బృందం కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీన్ని రద్దు చేసినట్టు, మరోసారి అపాయింట్‌మెంట్ ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి శనివారం రాత్రి సమాచారం అందించింది.

02/05/2017 - 06:24

ఇకనుంచి అలాగే వ్యవహరిస్తాం
దళిత, గిరిజన సంక్షేమమే లక్ష్యం
సబ్ ప్లాన్‌పై అవసరమైతే చట్ట సవరణ
మిగులు నిధులు మరుసటి ఏడాదికి బదలాయింపు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి
సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు
రాజకీయం చేస్తున్నారంటూ సర్కారు మండిపాటు

02/05/2017 - 06:21

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ విద్యుత్ రంగానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. ఈ అనుమతులు రావడం తెలంగాణ విద్యుత్ రంగానికి శుభ సూచకమని, ఇక ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

02/04/2017 - 05:06

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను జూలై నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. ఇప్పటి వరకు 1375కోట్ల రూపాయలను పునరావాసం, భూ సేకరణ కోసం ఖర్చు చేశారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో త్వరితగతిన పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని అధికారులను వారు ఆదేశించారు.

02/04/2017 - 04:58

హైదరాబాద్, ఫిబ్రవరి 3: గృహ నిర్మాణానికి కేంద్రం నుంచి రాష్ట్రం వాటాగా 767 కోట్ల రూపాయలు రానున్నాయని, మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు వచ్చే నిధులపై మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు.

02/04/2017 - 04:58

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లనలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ను తీసుకు వచ్చినట్టు, దీనివల్ల పనితీరు మెరుగు పడుతుందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. పట్టణాల పారిశుద్ధ్యం, వౌలిక వసతుల కల్పనలో ఆదర్శవంతమైన ఆచరణ నుంచి పరస్పరం నేర్చుకునేందుకే ఏకీకృత సర్వీసు రూల్స్ తీసుకు వచ్చినట్టు చెప్పారు.

02/04/2017 - 04:55

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3: ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ఆపరేషన్ల వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సిందేనని.. దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఆమలు పర్చని ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తామని హెచ్చరించారు.

Pages