S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/04/2017 - 02:08

హైదరాబాద్, ఫిబ్రవరి 3: సొంత కుమార్తెపై అత్యాచారం చేసిన తండ్రికి నాంపల్లి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలక్‌నుమాలోని అచ్చిరెడ్డి నగర్‌కు చెందిన ఒమర్‌ఖాన్ (55) 2005లో తన కుమార్తెపైనే అత్యాచారం చేశాడని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

02/04/2017 - 02:07

హైదరాబాద్, ఫిబ్రవరి 3: పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని, 11నెలల్లో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తి చేసిన తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టులు ఏవీ పూర్తి కాలేదని అన్నారు.

02/03/2017 - 05:01

హైదరాబాద్, ఫిబ్రవరి 2: నీటిపారుదల శాఖ టీమ్ వర్క్‌తో కోటి ఎకరాలకు సాగునీటిని ఇచ్చే విధంగా ప్రాజెక్టులు నిర్మించి చూపిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అనుకున్న సమయాని కన్నా ముందే భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించి చూపించామని, అదే స్ఫూర్తితో మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు.

02/03/2017 - 05:00

హైదరాబాద్, ఫిబ్రవరి 2: దేశంలో ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలు రానున్నాయని ఆయన చెప్పారు.

02/03/2017 - 04:59

హైదరాబాద్, ఫిబ్రవరి 2: గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్ అలియాస్ నరుూం పోలీస్, రాజకీయ నాయకులతో సంబంధాలపై సరైన ఆధారాలు లేవని హోంశాఖ ఇటీవల హైకోర్టుకు తెలిపింది. 2016 ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌లో హతమైన నరుూం కేసును విచారణ జరిపిన సిట్ 145 కేసులు నమోదు చేసి 95 మందిని అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.

02/03/2017 - 04:58

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత పోరాటానికి సిద్ధమైంది. నిరుద్యోగ యువతతో ఈ నెల 22న రాష్ట్ర రాష్టర్రాజధానిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) నిర్ణయించింది. టిజాక్ కేంద్ర కార్యాలయంలో కేంద్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సమావేశం తర్వాత కోదండరాం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

02/03/2017 - 04:55

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు సంస్థల యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ వివరాలు 2009 ఏప్రిల్ 1 నుండి 2016 డిసెంబర్ 31 వరకు తమకు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిఎఫ్ జాబితాలో చేరని ఉద్యోగుల వివరాలు కూడా ఇవ్వాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఓ) హైదరాబాద్ రీజనల్ పిఎఫ్ కమిషనర్ ఎంఎస్‌కెవివి సత్యనారాయణ తెలిపారు.

02/03/2017 - 04:55

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, విధానాలు మారకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలు-నివారణ అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం అధ్యక్షుడు పి.జంగారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది.

02/03/2017 - 04:53

హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ (ప్రగతి నగర్, కూకట్‌పల్లి) లోని ఎస్సో-ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్) ఏర్పాటై 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సంస్థ ప్రకటించింది. ఇన్‌కాయిస్ డిప్యూటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కెకెవి చారి ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

02/03/2017 - 04:23

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఫార్మాసిటీ కార్యక్రమాలను ప్రారంభించాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ తయారీని మంత్రి గురువారం సమీక్షించారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్న సుర్బానా జరోంగ్ కంపెనీ ప్రతినిధులు ఈ ప్రణాళికను వివరించారు.

Pages