S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/03/2017 - 04:21

దేవరకొండ, ఫిబ్రవరి 2: గిరిజనులు అధికంగా ఉండే నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లో గురువారం మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్ధినిని 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి వివాహం చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

02/03/2017 - 04:19

గోదావరిఖని, ఫిబ్రవరి 2: ‘ప్రపంచీకరణ... ప్రైవేటీకరణ... యాంత్రీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచ గని కార్మికులంతా సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైంది. కార్మిక వర్గంపై పెట్టుబడిదారి వ్యవస్థ జరుపుతున్న ముప్పేట దాడిని తిప్పికొట్టాలి’ అని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.

02/03/2017 - 04:17

సిద్దిపేట, పిబ్రవరి 2: సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పక్కా సమాచారం అందించటమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల ప్రధాన సమాచార కమిషనర్, రిటైర్డు ఐఎఎస్ అధికారి రతన్ అన్నారు. గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 10,141 దరఖాస్తులు, అప్పీళ్లను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/03/2017 - 04:16

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఆరోపించింది. ఆర్టీసి యాజమాన్యంతో కుమ్మక్కైన టిఎంయూ వైఫల్యాలను ఎండగడుతూ గురువారం రాష్టవ్య్రాప్తంగా అన్ని డిపోల వద్ద నిరశన, ధర్నా కార్యక్రమాలను నిర్వహించింది.

02/03/2017 - 04:16

హైదరాబాద్, ఫిబ్రవరి 2: పెద్ద నోట్ల రద్దును సమర్థించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఉపయోగపడే ప్రయోజనాలను సాధించలేకపోయారని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీని పెద్ద నోట్ల రద్దులో సమర్థించిన కెసిఆర్ తెలంగాణకు ఏమి తెచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందన్నారు.

02/03/2017 - 04:15

హైదరాబాద్, ఫిబ్రవరి 2: స్వామి వివేకానంద ఆశయాలను, వారి జీవిత చరిత్రను ప్రేరణగా తీసుకుని ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, రాష్ట్రంలోని యువత ప్రధానికి మద్దతుగా నిలవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు.

02/03/2017 - 04:15

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న సునందినీ పథకానికి సంబంధించి పశుదాణా డబ్బును రైతుల అకౌంట్లకు నేరుగా జమ చేసే ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఇందుకోసం ఈ-లాభ్ వెబ్‌సైట్‌ను గురువారం పశుసంవర్థక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా ప్రారంభించారు. సునందినీ ఫథకంలో మేలు జాతి పశువులకు రెండు సంవత్సరాల వరకు అవసమైన దాణాకోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది.

02/03/2017 - 04:14

హైదరాబాద్, ఫిబ్రవరి 2: న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్శిటీ సైబర్ సెక్యూరిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రొగ్రాం ప్రారంభించినట్టు పిజి డైరెక్టర్ ఎడ్వర్డ్ మోస్కల్ చెప్పారు. ఇది భారతీయ విద్యార్ధులకు ఎంతో అనువైన కోర్సు అని ఆయన పేర్కొన్నారు.

02/03/2017 - 04:14

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఎమ్మెల్సీ స్థానాల కోసం టిఆర్‌ఎస్‌లో ముందస్తుగానే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. శాసన సభలో బలాబలాల ప్రకారం ఈ మూడూ టిఆర్‌ఎస్‌కే లభించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఒకటి, టీచర్స్ కోటాలో ఒకటి, గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీ అవుతాయి.

02/03/2017 - 04:13

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నెలకోల్పే పైలాన్ నిర్మాణ బాధ్యతలను ప్రసిద్ధ శిల్పకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎక్కా యాదగిరికి అప్పగించారు. గురువారం నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం ఎక్కా యాదగిరిని సత్కరించారు. ఈ సందర్భంగా పైలాన్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినపుడు పైలాన్ రూపకల్పనకు సహకరించగలనని యాదగిరి పేర్కొన్నారు.

Pages