S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/13/2017 - 03:37

హైదరాబాద్, జనవరి 12: విద్య పూర్తిగా ఇంకా మన చేతుల్లోకి రాలేదని విద్యావేత్త ప్రొఫెసర్ కె హరగోపాల్ అన్నారు. టిపిటిఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు కొండల్, ఉపాధ్యక్షుడు తిరుపతి పాల్గొన్న ఈ సమావేశాల్లో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఇంకా విద్య ప్రపంచ బ్యాంకు చేతుల్లోనూ, వలసవాదుల చేతుల్లోనే ఉందని అన్నారు.

01/13/2017 - 03:27

హైదరాబాద్, జనవరి 12: వరంగల్‌లో ఏర్పాటు చేయబోయే టైక్స్‌టెల్ పార్క్ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఉపాధి కోసం ముంబాయి, భివాండీ, సూరత్‌లకు వలస వెళ్లిన కార్మికులను వెనక్కి రప్పించి స్థానికంగానే ఉపాధి కల్పిస్తామన్నారు.

01/13/2017 - 03:25

హైదరాబాద్/ జీడిమెట్ల, జనవరి 12: భూ లావాదేవీల్లో ఓ పాత నేరస్థుణ్ని వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పద్మానగర్‌లో నివాసముండే శైలేంద్రకుమార్ అలియాస్ చక్రవర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. బాపూనగర్‌లో నివాసముండే మందడి నాగేందర్‌రెడ్డి, చక్రవర్తి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు.

01/13/2017 - 03:22

హైదరాబాద్/జీడిమెట్ల, జనవరి 12: ఓ ఆడ శిశువు మృతదేహాన్ని నాలా లో పడేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ రైతుబజార్ సమీపంలోని హమాలీ అడ్డా సమీపంలో ఉన్న నాలాలో మృతి చెందిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

01/13/2017 - 03:20

హైదరాబాద్, జనవరి 12: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వేకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. రైల్వే ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

01/13/2017 - 03:18

హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్ ఎంపి, మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ సంచలనమైన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోసం సాలీనా రూ.690 కోట్లను ఖర్చుపెడుతోంది. ఒవైసీ ఈ విషయమై ట్వీట్ చేశారు. కేంద్రం హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని రద్దు చేసి, ఆ నిధులు బాలికల విద్యకు ఖర్చుపెట్టాలని ట్వీట్ చేశారు.

01/13/2017 - 03:17

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏమిటి? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే మళ్లీ జతకడుతుందా? లేక అధికార పక్షం టిఆర్‌ఎస్‌తో జత కడుతుందా అనే మీమాంస బిజెపి కార్యకర్తల్లో పెరిగిపోతున్నా కేంద్ర నాయకత్వం మాత్రం పెదవి విప్ప డం లేదు.

01/13/2017 - 03:16

హైదరాబాద్, జనవరి 12: రాష్ట్రంలో వసతి గృహాల్లో విద్యార్థులు లేరనే సాకుతో వాటిని మూసివేయాలని చూడటం సరైన ఆలోచన కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి కోట రమేశ్ పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస వౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థులు చేరడం లేద నే సాకుతో మూసివేత తగదని అన్నారు.

01/13/2017 - 03:16

హైదరాబాద్, జనవరి 12: నిజాం చక్కెర కర్మాగారానికి (ఎన్‌ఎస్‌ఎఫ్) సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలని టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని టిజాక్ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లో 49 శాతం వాటా ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.

01/12/2017 - 09:16

భద్రాచలం, జనవరి 11: సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఓ ఉన్నతాధికారి విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్‌ను విస్మరించారంటూ ఐదుగురు ఉద్యోగులకు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు మెమోలు జారీ చేశారు. తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ఆలయ దర్శనం కోసం వచ్చారు. ఆయనకు నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు.

Pages