S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/06/2017 - 01:18

హైదరాబాద్, జనవరి 5: అనాథ పిల్లలకు ఎస్సీలకు వర్తించే ప్రయోజనాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇకనుంచి అనాథ పిల్లలకు తల్లీతండ్రీ ప్రభుత్వమే అవుతుందన్నారు. శాసనసభలో గురువారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన లఘు చర్చలో బిజెపి పక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి అనాథ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.

01/06/2017 - 01:17

హైదరాబాద్, జనవరి 5:్ఫజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మార్చి 31లోగా చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం శాసన సభలో ప్రకటించారు. ఏ సంవత్సరం ఫీజు ఆ సంవత్సరం చెల్లించడం సాధ్యం కాదని, ఈ పథకం రూపకల్పనే అలా ఉందని చెప్పారు. గత ఏడాది బకాయిలు ఆర్థిక సంవత్సరం చివరలో చెల్లించడం మొదటినుంచి వస్తున్నదేనని, ఇప్పుడు కూడా అదేవిధంగా చెల్లించనున్నట్టు చెప్పారు.

01/05/2017 - 06:51

బెల్లంపల్లి, జనవరి 4: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ స్థాయి రగ్బీ పోటీలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని మంచిర్యాల కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.

01/05/2017 - 06:15

కొత్తగూడెం, జనవరి 4: ఆదివాసీ గిరిజనుల భూములను లాక్కునేందుకు రూపొందించిన కుట్రలో భాగంగానే ప్రభుత్వం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తోందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రోఫెసర్ కోదండరాం ఆరోపించారు. విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని పునుకుడు చెలక గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కోదండరాం ప్రసంగించారు.

01/05/2017 - 05:55

హైదరాబాద్, జనవరి 4: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను వెంటనే చెల్లించని పక్షంలో పిడి చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 21 మంది రైస్ మిల్లర్ల నుంచి దాదాపు రూ.17 కోట్ల విలువ చేసే ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు.

01/05/2017 - 05:48

హైదరాబాద్, జనవరి 4: ‘వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చాను. ఆట మొదలు పెట్టకుండానే రనౌటయ్యా’నని పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళిత అధికారులు తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదన్న అపవాదు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని ఆయన హితవు పలికారు. పదవీ విరమణ చేసిన ప్రదీప్ చంద్రకు ప్రభుత్వం తరఫున సచివాలయం బుధవారం విడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది.

01/05/2017 - 05:33

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో విద్యాప్రమాణాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పుడు సంస్థలపై చర్యలు తప్పవని, అదే విధంగా విద్యార్థి సంక్షేమంలో ప్రభుత్వం వెనుకంజ వేసేది లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన బదులిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం మోయలేని పెద్ద భారం ఏమీ కాదని అన్నారు.

01/05/2017 - 05:32

హైదరాబాద్, జనవరి 4: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వెనకడుగు వేసేది లేదని, దీనిపై విపక్షాలు, విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శాసనమండలి (కౌన్సిల్)లో తెలిపారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

01/05/2017 - 05:32

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇంత వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ. 4687.72 కోట్లు చెల్లించామని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇటీవలి కాలంలో కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో దాని ప్రభావం ఖజానాపై పడిందని, అయితే ఎంత మేరకు ఆ ప్రభావం పడుతున్నదో జనవరి నెలలో అవగతం అవుతుందని చెప్పారు.

01/05/2017 - 05:31

హైదరాబాద్, జనవరి 4: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయకపోతే కైరో తరహాలో లక్ష మంది విద్యార్థులతో ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని, కైరోలో మాదిరి ప్రభుత్వం గద్దెదిగే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.

Pages