S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/04/2017 - 04:59

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఒప్పంద లెక్చరర్లకు కొత్త వేతనాలను జనవరి నెల నుండి అమలుచేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటికే కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను ఏ విధంగా పెంచాలో వివరిస్తూ జీవో 14 జారీ చేశామని అన్నారు.

01/04/2017 - 02:08

హైదరాబాద్, జనవరి 3: శాసన సభలో అధికార పక్షం మినహా మిగిలిన వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని, దీనిపై సభలో ప్రశ్నిద్దామని ఎంఐఎం శాసన సభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్‌ను టిడిపి శాసన సభాపక్షం నాయకుడు రేవంత్‌రెడ్డి కోరారు. మిషన్ కాకతీయ, హరిత హారం, మత్స్య శాఖ ఏ అంశంపైనైనా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాల నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.

01/04/2017 - 02:05

హైదరాబాద్, జనవరి 3: పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు విజయ డైయిరీకి పాలు సరఫరా చేసే రైతులకు తొమ్మిది నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని నిరసిస్తూ మంగళవారం శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. వ్యవసాయానికి, రైతాంగానికి అందించాల్సిన ప్రోత్సహకానికి నిధులు విడుదల చేయకపోవడమే ప్రభుత్వం అందించే తోడ్పాటా అని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

01/04/2017 - 02:04

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో ఎనిమిది స్టడీ సర్కిళ్లు అనధికారికంగా నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

01/04/2017 - 01:53

హైదరాబాద్, జనవరి 3: మత్స్య పరిశ్రమకు మహార్థశ పట్టనుంది. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, వచ్చే రెండేళ్ళలో రెండు ఫిషరీస్ కాలేజీలు, రెండు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో స్వల్ప వ్యవధి ప్రశ్నకింద మత్స్య పరిశ్రమ అంశంపై చేపట్టిన చర్చకు సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.

01/04/2017 - 01:51

హైదరాబాద్, జనవరి 3: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైకోర్టులో ఊరట లభించింది. గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సదరన్ రీజియన్ బెంచ్ విధించిన స్టేను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. తమ వాదనలు వినకుండానే ఎన్జీటీ స్టే విధించిందన్న తెలంగాణ వాదనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

01/04/2017 - 01:49

జగదేవ్‌పూర్, జనవరి 3: సిఎం దత్తత గ్రామాలో నిర్మించిన డబుల్ బెడురూం ఇళ్లు దేశానికే స్ఫూర్తిదాయకమని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌గోయల్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సగం నిధులు కేటాయిస్తుందన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆధునాతన పరిజ్ఞానంతో కేవలం రూ.

01/03/2017 - 04:07

హైదరాబాద్, జనవరి 2: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో అప్పీళ్లను హైకోర్టు స్వీకరించింది. మూడున్నరేళ్ల క్రితం జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులో తేలిన అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహసిన్ అక్తర్, జియాహుల్ రెహ్మన్, యజాజ్ షేక్‌లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఎన్‌ఐఎ న్యాయస్థానం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో వచ్చిన అప్పీళ్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

01/03/2017 - 03:36

హైదరాబాద్, జనవరి 2: అర్చకులు, ఆలయాలలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంపుదలకే అవసరమైతే చట్టసవరణ చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్‌తో చర్చించాలని కమిటీ నిర్ణయించింది.

01/03/2017 - 03:34

హైదరాబాద్/ఉప్పల్, జనవరి 2: దేశాభివృద్ధికి శాస్ర్తియమైన పరిశోధన ఫలాలు ఎంతో అవసరమని సిసిఎంబి వ్యవస్థాపకుడు, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ పిఎం భార్గవ అన్నారు. తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్ ప్రశాంతినగర్‌లో ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్‌పై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

Pages