S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/10/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరిట శాసనమండలి (లెజిస్లేచర్) కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజాసదారామ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

12/10/2016 - 03:02

భద్రాచలం, డిసెంబర్ 9: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈసారి ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ప్రయోగాత్మకంగా తొలిసారి ఈ ప్రక్రియకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. మొత్తం నాలుగు వేల టిక్కెట్లలో 50 శాతం అంటే 2వేల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. మిగిలిన 50 శాతం టిక్కెట్లలో 25 శాతం దేవస్థానం, 25 శాతం రెవెన్యూ శాఖ ద్వారా విక్రయించనున్నారు.

12/10/2016 - 03:01

హైదరాబాద్, డిసెంబర్ 9: అవినీతి నిరోధక వారోత్సవాలు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఏసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, డైరెక్టర్ చారుసిన్హాల ఆధ్వర్యంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.

12/10/2016 - 02:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

12/10/2016 - 02:53

కరీంనగర్, డిసెంబర్ 9: క్రీడలకు, క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రానున్న రోజుల్లో దేశంలోనే తెలంగాణ క్రీడల్లో నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

12/09/2016 - 04:52

సంగారెడ్డి, డిసెంబర్ 8: రైతుల ఆత్మహత్యలు, వలసలు నివారించడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టాలని యోచిస్తే కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి తప్పులన్నింటిని ఎత్తి చూపించి అసెంబ్లీలో సబ్బుతో కడిగినట్లు కడిగేస్తానని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.

12/09/2016 - 04:50

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 8: విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ పంచాయతీ శివారులోని శ్రీనాథ్ రూట్ ప్యాక్ లిమిటెడ్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

12/09/2016 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 8: నోట్ల సమస్యపై ప్రజల్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే ప్రమాదం ఉందని పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా, ప్రజలకు ఉపశమనం కలిగించ లేకపోయారని విమర్శించారు. ‘సామాన్యులు పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు.

12/09/2016 - 04:48

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో డిసెంబర్ 15 నుండి 26 వరకు హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తెలిపారు. సచివాలయంలో గురువారం నేషనల్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను రమణాచారి ఆవిష్కరించారు. నోట్ల రద్దు ప్రభావం లేకుండా నగదు రహితంగా పుస్తకాలు కొనుగోలు చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయాలని కోరారు.

12/09/2016 - 04:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో వీలున్నంత త్వరగా ప్రతిపాదిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య గురువారం తెలిపారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయలతో కలిసి నంది ఎల్లయ్య పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీని కలిశారు. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వారు వివరించగా ప్రధాని సావధానంగా విన్నారు.

Pages