S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/08/2016 - 06:28

హైదరాబాద్, డిసెంబర్ 7: పెద్ద నోట్లు రద్దు చేసి 28 రోజులు గడిచినప్పటికీ బ్యాంకుల వద్ద క్యూలైన్లు మాత్రం తగ్గడం లేదని, వారంలో బ్యాంకుల వద్ద సాధారణ పరిస్థితి తీసుకురావాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.

12/08/2016 - 06:27

హైదరాబాద్, డిసెంబర్ 7: శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 16 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపించాల్సిందిగా శాసనసభ కార్యదర్శి రాజాసదారామ్‌ను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శాసనసభ సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది.

12/07/2016 - 05:38

జయలలిత ప్రజల మనిషి. ఆమె రాజకీయ జీవితం సాహసోపేతం. తమిళనాడువంటి రాజకీయ చైతన్యం కలిగిన సమాజంలో సిఎంగా, పార్టీ అధ్యక్షురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది చరిత్ర సృష్టించారు.
-సిఎం కె చంద్రశేఖర్‌రావు

12/07/2016 - 04:34

సంగారెడ్డి, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల దశదిశ మార్చే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముహూర్తం ఖరారు చేసారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 7.30 గంటలకు దివ్యమైన ముహూర్తంగా వేద పండితులు నిర్ణయించి 8.30 గంటలలోపు కార్యక్రమాన్ని పూర్తి చేయించాలని సూచించారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు.

12/07/2016 - 04:31

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఏకకాలంలో రైతుల రుణ మాఫీ చేయాలని సంతకాల సేకరణ, విద్యార్థుల ఫీజుల రీయంబర్స్‌మెంట్ వంటి సమస్యలపై ఆందోళనలు చేపట్టినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

12/07/2016 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 6: క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీ జిల్లాకు వివిధ రంగాలపై సూక్ష్మస్థాయి పరిశీలనలతో క్షుణ్ణంగా అధ్యయనం చేసి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర కలెక్టర్లను ఆదేశించారు.కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారి ఈ నెల 14న నిర్వహించబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించే అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో ప్రదీప్ చంద్ర వీడియో కాన్ఫ

12/07/2016 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 6:బిసి సంక్షేమ హాస్టళ్లు, బిసి గురుకులాల్లో 49వేల మంది విద్యార్థులకు తక్షణమే రగ్గులు పంపిణీ చేయాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. బిసి సంక్షేమానికి నిధులు కొరత లేదని, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జోగు రామన్న విమర్శించారు. బిసిల కోసం ఎన్ని నిధులను కేటాయించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

12/07/2016 - 02:39

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తుల భావ స్వేచ్ఛను హరిస్తున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. విమలక్కను పోలీసులతో అణచి వేసే ప్రయత్నం చేస్తున్నదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

12/07/2016 - 02:38

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు 50 రోజుల్లో 41 లేఖలు రాసినా స్పందించలేదని సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డిజి నరసింహారావు విమర్శించారు.

12/07/2016 - 02:38

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణలో గత రెండేళ్లలో అత్యధికంగా నిధులను మంజూరు చేయడమేగాక, పెద్ద ఎత్తున అధికారుల్లో కదలిక తీసుకువచ్చి పాఠశాల విద్యను పునర్వ్యవస్థీకరించినా, ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఎంత చేసినా ఎందుకీ వైఫల్యం అంటూ ప్రశ్నించారు.

Pages