S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/07/2016 - 02:37

ఆదిలాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ సర్కారు కొలువుదీరి రెండున్నరేళ్లు గడిచినా.. పేదోడి సొంతింటి కల నెరవేరని హామీగానే మిగిలిపోయింది. గూడులేని పేదలందరికి అనువైన వసతులతో ఇంటిని నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రుల వాగ్దానాలు నీటిమూటగానే మిగిలిపోవడంతో డబుల్‌బెడ్‌రూం ఇల్లుపై ఆశలు పెట్టుకున్న పేదవర్గాలు నిరాశతో నిరీక్షిస్తూనే ఉన్నాయి.

12/07/2016 - 02:35

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రపంచంలో ఆరువేల భాషలు కనుమరుగు అవుతుండగా, అందులో 42 భారతీయ భాషలు శాశ్వతంగా కనుమరుగయ్యే ముప్పు ఉందని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ సంస్థ తేల్చింది. దేశంలో మాట్లాడే భాషలు 380 ఉండగా అందులో 96 శాతం భాషలు సైతం కనుమరుగయ్యే ముప్పు ఉందని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద కోట్ల ప్రజల్లో నాలుగు శాతం ప్రజలు ఈ 96 శాతం భాషలను మాట్లాడుతున్నారు.

12/07/2016 - 02:34

న్యూఢిల్లీ, డిసెంబరు 6: ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్ర సామాజిక న్యాయశాఖమంత్రి చావర్ చంద్ గెహ్లాట్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అద్యక్షుడు మాదిగ విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఆలస్యం చేయకుండా తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరారు.

12/07/2016 - 02:33

హైదరాబాద్, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా టిడిపి నేతలు అంబేద్కర్ ఫొటోకి పూలదండ వేసి ఘనంగా నివాళి అర్పించారు.

12/07/2016 - 02:33

హైదరాబాద్, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, నాయిని నర్సింహ్మారెడ్డి మద్రాస్ వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ ఇద్దరు మంత్రులు వెళ్లారు.

12/07/2016 - 02:32

హైదరాబాద్, డిసెంబర్ 6: ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం(ఐడిఎస్) కింద నల్లధనం వెల్లడి చేసిన వారి బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గత వారం ముంబైలో 13వేల కోట్ల వెల్లడించి పన్నువాయిదా కట్టని మహేశ్‌షాకు తోడు హైదరాబాద్‌లో లక్ష్మణరావు అనే వ్యక్తి జత కలిశాడు. సెప్టెంబర్ 30తో ముగిసిన ఐడిఎస్ కింద రూ.9800 కోట్ల నగదు ఉన్నట్లు ఫిలింనగర్‌కు చెందిన లక్ష్మణరావు ప్రకటించాడు.

12/07/2016 - 02:30

జఫర్‌గడ్, డిసెంబర్ 6: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

12/07/2016 - 02:30

హైదరాబాద్, డిసెంబర్ 6: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంత వరకూ సమంజసమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాంక్‌బండ్ వద్ద బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి బిజెపి నేతలు నివాళులు అర్పించారు.

12/07/2016 - 02:29

న్యూఢిల్లీ, డిసెంబరు 6: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ప్రతి జిల్లాలో జవహార్ నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను (డైట్) ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్రంలోని 110 వెనుకబడిన మండలాలకు కస్తూర్బా పాఠశాలలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

12/06/2016 - 04:58

నిజామాబాద్, డిసెంబర్ 5: నిజామాబాద్ జిల్లా వైభవానికి ప్రతీకగా నిలిచిన నిజాం షుగర్స్‌తో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించి చెరకు రైతులు, కార్మికులను ఆదుకోవాలని టిజెఎసి చైర్మెన్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరఫున కాస్తంత చేయూతను అందిస్తే ఈ ఫ్యాక్టరీలు పునః ప్రారంభమై మంచి లాభాలు అందించేందుకు ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు.

Pages