S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/06/2016 - 04:34

హైదరాబాద్, డిసెంబర్ 5: గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంటసేపు సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నెల మూడవ వారంలో వారం రోజుల పాటు శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాల నిర్వహణపై గవర్నర్‌కు వెల్లడించినట్టు తెలిసింది.

12/06/2016 - 04:29

హైదరాబాద్, డిసెంబర్ 5: జాతీయ పుస్తక మహోత్సవాన్ని ఈ నెల 15వ తేదీ నుండి 26వ తేదీ వరకూ హైదరాబాద్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి కె చంద్రమోహన్‌లు తెలిపారు. ప్రతి రోజు మధ్యా హ్నం 2 గంటల నుండి సాయంత్రం 8.30 వరకూ జరుగుతుందని అన్నారు.

12/06/2016 - 04:28

దేవరకొండ, డిసెంబర్ 5: గడ్డం పెంచుకున్నంత మాత్రాన సి ఎం అవుతాననుకోవడం తప్పని, అలా అనుకోవడం దద్దమ్మలకే చెల్లుతుందని తలక్రిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కల్లేనని రాష్ట్ర అటవీ, బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం పట్టణంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12/06/2016 - 04:01

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేయాలనుకున్న కాంగ్రెస్ నాయకుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె.

12/06/2016 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 5: పంటల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళ్లాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం’ సందర్భంగా హైదరాబాద్ (ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, నాంపల్లి)లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, విత్తనోత్పత్తిలో తెలంగా ణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

12/05/2016 - 03:06

హైదరాబాద్, డిసెంబర్ 4: నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత ‘సిట్’ జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అనేక ఉదంతాలపై సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈమధ్య నరుూం గ్యాంగ్‌లో అరెస్టయిన వారిలో కొందరు విడుదల అవుతున్నట్లు తెలుస్తున్నదని ఆయన తెలిపారు.

12/05/2016 - 03:05

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర. ఆయన ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

12/05/2016 - 03:02

సంగారెడ్డి, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అన్ని విధాలుగా ఆటంకం కల్గిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లిళ్లు, పేరంటాలకే కాదు, చివరకు తుది శ్వాస విడిచిన వ్యక్తుల అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించడానికి పెద్ద సంకటం కల్పిస్తోంది.

12/05/2016 - 03:01

నల్లగొండ, డిసెంబర్ 4: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే దసరా నాటికి ప్రధాన ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేసి దేశంలోనే తిరుపతి తరహాలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా యాదాద్రిని తీర్చిదిద్ధాలన్న సీఎం కెసిఆర్ సంకల్పం దిశగా యాడా(యాదాద్రి అభివృద్ధి ప్రాథికార సంస్థ) ముందడుగు వేస్తుంది.

12/05/2016 - 02:57

హైదరాబాద్, డిసెంబర్ 4: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం బతుకమ్మ ఘాట్‌లో తన స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన వికాస్ అనే విద్యార్థి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Pages