S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/05/2016 - 02:56

హైదరాబాద్, డిసెంబర్ 4: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా జిపిఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు పౌర సరఫరాలశాఖ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. సరుకులు గోదాం నుంచి బయలుదేరి చౌకధరల దుకాణాలకు చేరేవరకు పటిష్ఠమైన నిఘా ఉంటుందన్నారు. పౌరసరఫరాల భవన్‌లో ఆదివారం రేషన్ సరుకుల చేరవేసే కాంట్రాక్టర్లతో కమిషనర్ సమావేశమయ్యారు.

12/05/2016 - 02:54

మక్తల్, డిసెంబర్ 4: ప్రతి మనిషి నిత్యం కనీసం 5నిమిషాలైనా భగవంతుని సన్నిధిలో కూర్చొని భగవన్ నామస్మరణ చేయాలని శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య, హంపి పీఠాధిపతి వీరుపాక్ష విద్యారణ్య భారతిస్వామిజీ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మక్తల్‌లో సుమారు రూ.80 లక్షల వ్యయంతో నిర్మింప చేసిన దివ్య, భవ్యమైన శ్రీఅయ్యప్పస్వామి దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

12/05/2016 - 02:52

హైదరాబాద్, డిసెంబర్ 4: ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ప్రకటించాలని టి.టిడిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. 2008 సంవత్సరంలో సమ్మక్క-సారలమ్మ (మేడారం) జాతర సందర్భంగా ములుగు జిల్లా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని ఆమె ఆదివారం విలేఖరుల సమావేశంలో గుర్తు చేశారు.

12/05/2016 - 02:51

హైదరాబాద్, డిసెంబర్ 4: రైతులకు టన్ను చెరకుకు 4 వేల రూపాయల కనీస మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కర్నాటకలో టన్ను చెరకుకు 3600 రూపాయలు చెల్లిస్తున్నారని, మహారాష్టల్రో 3500 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

12/05/2016 - 02:50

హైదరాబాద్, డిసెంబర్ 4: బైక్ రేసింగ్‌లు అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇటీవల పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఘటన మరువకముందే తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ బైక్ రేసర్ రెచ్చిపోయాడు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం 3లో నదీమ్ అనే బైక్ రేసర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గోపాల్ అనే వ్యక్తిని ఢీ కొట్టాడు.

12/05/2016 - 02:43

దేవరకద్ర, డిసెంబర్ 4: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని గోప్లాపూర్ క్రాస్‌రోడ్డు దగ్గర ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలుకాగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి కర్ణాటకలోని సింధనూర్‌కు వెళ్తున్న కారును రాయిచూర్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

12/05/2016 - 02:41

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం తీవ్రవాదుల డెన్‌గా మారిందని హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. జనశక్తి నాయకులు ‘టఫ్’ కార్యాలయాన్ని తీవ్రవాద డెన్‌గా మార్చుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని, తెలంగాణ, ఆంధ్రాలో కొత్తగా మూడు దళాలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారని డిఐజి అన్నారు.

12/05/2016 - 02:34

హైదరాబాద్, డిసెంబర్ 4: విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. 14 విద్యుత్ సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. యాజమాన్యంతో చర్చలు సఫలం కావడం వల్ల సమ్మెను విరమిస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దశల వారిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మార్చి 31 లోగా మార్గదర్శకాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.

12/05/2016 - 02:33

హైదరాబాద్, డిసెంబర్ 4: భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి భూదందాలపై సిబిఐ విచారణ జరిపించాలని తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు వెదిరే అరవింద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా భూదాన బోర్డును ఏర్పాటు చేయాలని వారు ఆదివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

12/05/2016 - 02:32

హైదరాబాద్, డిసెంబర్ 4: వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్‌కు జీవం పోయాలని కోదండరామ్ ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్ , శ్రీనివాస్‌రెడ్డిలు విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Pages