S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/23/2016 - 02:47

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆదివారం ‘మాటామంతీ’ (ఇంటరాక్టివ్ సెషన్) నిర్వహిస్తున్నారు.

10/22/2016 - 08:08

కోస్గి, అక్టోబర్ 21: సర్కార్ దవాఖానాలోని సేవలపై నమ్మకం లేక మెరుగైన చికిత్సలను ఆశించి ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్తే.. తల్లీబిడ్డలు ప్రాణాలు కొల్పోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.

10/22/2016 - 08:08

చండూరు, అక్టోబర్ 21: నల్లగొండ జిల్లా చండూరు మండలం గొల్లగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో చిన్నారి కడారి పావని (3) దుర్మరణం చెందింది. చండూరు కృష్ణవేణి పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్ విద్యార్థులను దించేందుకు గొల్లగూడెంవచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఆడుకొంటున్న పావని వ్యాన్ వెనుక చక్రాలకు తగలడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

10/22/2016 - 08:07

హైదరాబాద్, అక్టోబర్ 21: ‘ప్రభుత్వం మెడలు వంచుతాం... ఫీజు రీయంబర్స్‌మెంట్ వసూలు చేసి, విద్యార్థులకు న్యాయం చేస్తాం..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పోరాట బాట పట్టింది.

10/22/2016 - 08:01

సంగారెడ్డి, అక్టోబర్ 21: పొరుగున ఉన్న భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న జైళ్ల పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, అదే స్ఫూర్తిని తమ దేశంలోని జైళ్లలో ఆవిష్కరిస్తామని బంగ్లాదేశ్‌కు చెందిన జైళ్ల శాఖ అదనపు ఐజి కల్నల్ ఇక్బాల్, రక్షణ శాఖ డిప్యూటీ సెక్రటరీ షేక్ షకీల్ అహ్మద్‌లు పేర్కొన్నారు. 14 మంది సభ్యులతో ఉన్న ఈ బృందం తెలంగాణలోని చర్లపల్లి, తమిళనాడులోని వేలూరు జైళ్లను సందర్శించారు.

10/22/2016 - 07:42

హైదరాబాద్/ఖైరతాబాద్, అక్టోబర్ 21: దేశ రాజకీయాలను నీచస్థాయికి తీసుకువెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విమర్శించారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను విజయవంతంగా పూర్తిచేసుకొని నగరానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు.

10/22/2016 - 07:39

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ - అస్సాం రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై త్వరలోనే పలు ఒప్పందాలు జరుపుకోనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అస్సాం రాష్ట్ర అటవీ, ఐటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్ మంత్రి కేశభ్ మహంత వెల్లడించారు.

10/22/2016 - 07:36

కరీంనగర్, అక్టోబర్ 21: ప్రజల ముంగిటకే పాలన అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన జరిగి 11రోజులు గడిచినా.. కొత్త పాలన బాలారిష్టాలే ఎదుర్కొంటోంది. ఓ వైపు కొత్త కార్యాలయాల్లో కనీస వసతులు కరవు, మరోవైపు కార్యాలయాలకు చేరని దస్త్రాలు, ఫైళ్లు వెరసి పాలనపై ప్రభావం చూపుతూ ఇటు ప్రజలకు, అటు ఉద్యోగస్థులకు తంటాలు తప్పటం లేదు.

10/22/2016 - 07:28

భద్రాచలం, అక్టోబర్ 21: ఆదివాసీల అమ్మభాషకు గ్రహణం పట్టింది. పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా గిరిజన గూడేల్లో డ్రాపౌట్లు ఏటికేడు పెరుగుతున్నాయి. బడికి దూరమై బతుకుభారమై గిరిపుత్రులు పశువుల కాపర్లుగా మారుతున్నారు. తెలంగాణలో అమ్మభాష ద్వారా గిరిజనులకు పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు మూలనపడింది. పాలకుల అలసత్వం గిరికూనలకు శాపంగా పరిణమించింది.

10/22/2016 - 07:17

ఆంధ్రభూమి బ్యూరో

Pages