S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/03/2016 - 08:38

హైదరాబాద్, అక్టోబర్ 2: జనగామ జిల్లాగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎన్నికలకు ముందు చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండి ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా చేయాలని పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటలకు విలువ ఇవ్వాలని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. జనగామ జిల్లా కావాలన్నది ప్రజల ఆకాంక్ష అని ఆయన చెప్పారు.

10/03/2016 - 08:38

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పని చేస్తే 2019 ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో లాల్ బహదూర్ శాస్ర్తీ, మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించారు.

10/03/2016 - 08:08

హైదరాబాద్, అక్టోబర్ 2: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేసి, వికారాబాద్ జిల్లాకు మరో పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

10/03/2016 - 07:49

హైదరాబాద్, అక్టోబర్ 2: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో గల బాపు ఘాట్ వద్ద గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, అధికారులు నివాళులు అర్పించారు.

10/03/2016 - 07:37

హైదరాబాద్, అక్టోబర్ 2: జిల్లాల పునర్వ్యవస్థీకరణ అత్యంత శాస్ర్తియంగా జరుగుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ముసాయిదాలో ప్రతిపాదించిన జిల్లాలు, డివిజన్లు, మండలాలు మాత్రమేకాకుండా ప్రజాభీష్టం మేరకు మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్థంగా ఉందని ప్రకటించారు. ప్రతిపాదించిన జిల్లాలు, డివిజన్లు, మండలాలకంటే వాటి సంఖ్య పెంచడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

10/03/2016 - 07:34

హైదరాబాద్, అక్టోబర్ 2: కొత్తజిల్లాలు ఏర్పడబోతున్న సమయంలో రెవెన్యూ సిబ్బంది, గ్రూప్ వన్ ఆఫీసర్ల (రెవెన్యూ మినహా ఇతర శాఖలు) మధ్య జాయింట్ కలెక్టర్ ‘హోదా’ కోసం అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 10 జిల్లాల పునర్వ్యవస్థీకరణ దసరా పండగ నుండి జరుగుతుండటంతో 27 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ప్రతి జిల్లాకు కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్‌ను నియమించాల్సి ఉంటుంది.

10/03/2016 - 03:16

పాపన్నపేట: మంజీర ప్రవాహం ఉధృతి పెరగడంతో ఎల్లాపూర్ బ్రిడ్జిపై నుండి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎల్లాపూర్ బ్రిడ్జిపై నుండి మంజీర పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయల్లో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి వివిధ వాహనాల్లో పెద్దఎత్తున తరలివచ్చినా ఎల్లాపూర్ వద్దే ఆగిపోతున్నారు.

10/03/2016 - 03:16

కడెం, అక్టోబర్ 2: రెండు మూడు రోజుల నుండి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వరదనీరు వచ్చిచేరుతుండడంతో ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్దదైన కడెం జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.

10/03/2016 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బకాయిలను చెల్లించనందు వల్ల ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేకపోతున్నామని, ఆర్ధిక భారంతో తాత్కాలికంగా ఈ సేవలను ఆదివారం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ సంఘం నిర్వాహకుడు డాక్టర్ జలపతి రెడ్డి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్స్ పరిధిలో దాదాపు 250 ఆసుపత్రులు ఉన్నాయి.

10/03/2016 - 03:13

పాపన్నపేట, అక్టోబర్ 2: రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావానిమాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు నుండి భారీగా నీరు విడుదల చేయడంతో ఘణపురం డ్యామ్, ఏడుపాయల వనదుర్గా ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఘణపురం డ్యామ్‌పై నుండి ఉధృతంగా వస్తున్న మంజీర పొంగిపొర్లుతూ పరవళ్లు తొక్కుతోంది.

Pages