S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/02/2016 - 03:40

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆదిలాబాద్ జిల్లా దహెగాం గ్రామంలో పాముకాటుకు గురై మరణించిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు రూ. 8 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు శనివారం తెలంగాణ రాష్ట్ర సర్వశిక్ష అభియాన్‌ను ఆదేశించింది. 2006 ఆగస్టు 23వ తేదీన రాజేశ్వరి, లక్ష్మి అనే ఇద్దరు విద్యార్థినులు దహెగాం గ్రామంలోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో పాముకాటుకు గురై మరణించారు.

10/02/2016 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 1: దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసి 3064 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సిబిఎస్, జెబిఎస్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు టిఎస్‌ఆర్టీసి హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేణు తెలిపారు.

10/02/2016 - 03:38

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాల్లో పెంచేందుకు 34.63 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మత్స్యశాఖ సహకార సంఘాలు, అధికారులతో శనివారం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

10/02/2016 - 03:12

మద్నూర్, అక్టోబర్ 1: సంగారెడ్డి-నాందేడ్-అకోలా (ఎస్‌ఎన్‌ఎ) రహదారిపై నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం పెద్దఎక్లారా సమీపంలోని ఓ లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనతో ఎస్‌ఎన్‌ఎ రహదారిపై 15 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

10/02/2016 - 03:58

మహబూబ్‌నగర్, అక్టోబర్ 1: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాసవీమాత అమ్మవారికి భక్తులు నాలుగున్నర కేజీల బంగారం చీరను బహూకరించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని కన్యకాపరమేశ్వరిమాతకు శనివారం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులతో పాటు భక్తుల సహకారంతో తయారు చేసిన బంగారు చీరను అమ్మవారికి అలంకరించారు. శరన్నవరాత్రిలో భాగంగా బంగారు చీరలో వాసవీమాత భక్తులకు స్వర్ణాలంకృత దేవిగా దర్శనమిచ్చారు.

10/02/2016 - 03:07

మద్నూర్/తలమడుగు, అక్టోబర్ 1: ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు నీళ్లలో మునిగి దుర్మరణం పాలయ్యారు. వేర్వేరుగా చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనలు స్థానికులను కలచివేశాయి. మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ పట్టణానికి చెందిన సందేశ్ (15) 9వ తరగతి, ప్రతీక్(13) 8వ తరగతి చదువుతున్నారు. నిజామాబాద్ జిల్లా మద్నూర్‌కు చెందిన వీరిద్దరూ చేరువలో ఉన్న చిన్నశక్కర్గలో ఉన్న చెరువుకుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు.

10/02/2016 - 03:05

హైదరాబాద్, అక్టోబర్ 1: ప్రాంతా లు, కులాలు, మతాలు, జాతులు, భాషలకు అతీతంగా ప్రజలందరినీ అక్కున చేర్చుకునే సంస్కృతి, సుహృద్భావ వాతావరణం తెలంగాణ మి నహా ఇతర ఏ రాష్ట్రంలో కనిపించదని జలవనరుల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని అఖిల భారత ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రసేన్ 5140వ జయంతి ఉత్సవాలను హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు.

10/02/2016 - 03:03

మహబూబ్‌నగర్, అక్టోబర్ 1: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ రాజీనామా అంటూ డ్రామాలకు తెరలేపారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే అరుణ గద్వాల జిల్లా కోసం తన పదవి అడ్డంకి అయితే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటిం చి ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో ఈ విషయంపై మంత్రి జూపల్లి స్పందించారు.

10/02/2016 - 03:01

హైదరాబాద్, అక్టోబర్ 1:గద్వాల జిల్లా ఏర్పాటు చేయడానికి తాను అడ్డు కాకూడదనే ఉద్దేశంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి రాజీనామా లేఖ పంపించినట్లు ఆమె శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

10/02/2016 - 03:00

సంగారెడ్డి, అక్టోబర్ 1: డ్రైవర్ అనుభవ రాహిత్యంతో ఐదుగురు చిన్నారులు సహా ఓ మహిళ నిండుప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటిస్తానన్న మితిమీరిన ఆత్మవిస్వాసమే విలువైన ప్రాణాలను బలిగొంది. మెదక్ జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన జంగం శంకర్ ట్రాన్స్‌కోలో లైన్‌మెన్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు కుమారులు పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Pages