S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/02/2016 - 02:57

నాగార్జునసాగర్, అక్టోబర్ 1: నాగార్జునసాగర్‌లో శుక్రవా రం రాత్రి నుండి సాగర్ డ్యాంపై నిఘాను పెంచారు. దీంతోపాటు భద్రత సిబ్బందిని అప్రమత్తం చేసి సున్నితమైన ప్రదేశాలలో బలగాలను పెంచారు. నాగార్జునసాగర్ డ్యాంపై, ప్రధాన ద్వారం వద్ద, క్రస్ట్‌గేట్ల వద్ద, ఎడమకాల్వ ప్రధాన ద్వారం వద్ద గతంలో ఉన్న భద్రత సిబ్బంది కంటే అధిక సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేశారు.

10/02/2016 - 02:53

అలంపూర్, అక్టోబర్ 1: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. మొదటిరోజు శనివారం గణపతిపూజ, పుణ్యహవచనం, రుత్వివరణం, మహాకలశస్థాపన, సాయం త్రం ధ్వజారోహణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం నుండి ఇఓ గురురాజ, అర్చకులు మేళతాళాల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

10/02/2016 - 02:50

బాసర, అక్టోబర్ 1: ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో శనివారం శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో కలశపూజ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించి ఘటస్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

10/01/2016 - 06:00

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు కేంద్రం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్రంలో 12వందల కోట్ల రూపాయల వ్యయంతో 120 మైనారిటీ కాలేజీల నిర్మాణం చేపట్టామని, దీనికి కేంద్రం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇటీవల కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖను కోరారు.

10/01/2016 - 05:59

కరీంనగర్, సెప్టెంబర్ 30: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి లోయర్ మానేర్ డ్యాం (ఎల్‌ఎండి)లో చేరింది. ఎల్‌ఎండి నిండుకుండలా మారడంతో శుక్రవారం తెల్లవారుఝామున 8గేట్లు, మధ్యాహ్నం వరకు మరో 3గేట్లు మొత్తం 11 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదిలారు. మూడు రోజుల క్రితం ఉదయం ఆరు గేట్లను ఎత్తగా, తిరిగి సాయంత్రం గేట్లను మూసివేశారు.

10/01/2016 - 05:58

హైదరాబాద్, సెప్టెంబర్ 30: నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు సత్వరం పూర్తి చేసి ఎడమ కాలువ ద్వారా అదనంగా లక్షా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పనులపై కాడా కమీషనర్ డాక్టర్ మల్సూర్, సాగర్ సిఇ సునీల్ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు శుక్రవారం నివేదిక అందజేశారు.

10/01/2016 - 03:03

హైదరాబాద్, సెప్టెంబర్ 30: జిల్లాల పునర్విభజన ప్రక్రియ కోసం ఖరారు చేసిన కార్యాచరణ మేరకు పనులన్నీ చకచకా పూర్తి అవుతున్నాయి. కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు అక్టోబర్ 5వ తేదీ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ కార్యాచరణను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

10/01/2016 - 03:01

ఇందూర్, సెప్టెంబర్ 30: బతుకమ్మ వేడుకలకు ప్రపంచ ఖ్యాతి తీసుకువచ్చే కార్యక్రమంలో భాగం గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బతుకమ్మ పండుగ నిర్వహించారు. ఉమ్ ఆల్ క్వయిన్‌లో అక్కడి తెలుగు మహిళలతో కలిసి ఎంపి కవిత రంగురంగుల పూల తో బతుకమ్మను అలంకరించి, ఆడి పాడి వైభవంగా పండుగ జరుపుకున్నారు.

10/01/2016 - 02:59

హైదరాబాద్, సెప్టెంబర్ 30: రాష్టవ్య్రాప్తంగా ఉన్న 4,533 చెరువులలో 35 కోట్ల చేపపిల్లలను పెంచాలని ము ఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

10/01/2016 - 02:58

గద్వాల, సెప్టెంబర్ 30: గద్వాల జిల్లా కోసం గత మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి దీక్షను గురువారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య పొలీస్ బలగాలు అక్కడికి చేరుకొని దీక్షను భగ్నం చేశారు.

Pages