S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/30/2016 - 04:59

నిజాంసాగర్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా రైతుల వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో గురువారం సాయం త్రం వరకు కూడా ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఐదవ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు గోదావరిలోకి 8గేట్లను ఎత్తినీటిని విడుదల చేశారు. సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో ప్రాజెక్ట్ గేట్లను పూర్తిగా మూసివేశారు.

09/30/2016 - 04:57

పిట్లం, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం ఐదు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుపో యంది. గురువారం వాగు దాటే క్రమంలో కుర్తికి చెందిన వీరబోయిన అంజయ్య (34) అనే యువకుడు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయి నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

09/30/2016 - 04:52

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: ఆముదానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం రోడ్డెక్కారు. వందలాది మంది రైతులు తాము పండించిన ఆముదం పంటను దేవరకద్ర మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. అయితే మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు రూ.2500 నుండి రూ.3000 వరకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో రైతులు ఆముదాన్ని విక్రయించేందుకు నిరాకరించారు.

09/30/2016 - 03:55

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలో గల ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించిన దరిమిలా ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఫోన్‌లో సూచించారు. దీంతో హైదరాబాద్ సహ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

09/30/2016 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి శిబిరాలను ధ్వంసం చేయడం భారత సైనికుల సాహసోపేతమైన చర్య అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత సైన్యాన్ని, ప్రధాని నరేంద్రమోదీని అభినందించారు.

09/30/2016 - 03:54

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన ప్రక్రియపై స్టే ఇవ్వడానికి హైకోర్టు మరోసారి నిరాకరించింది. తమ వద్ద ఉన్న పెండింగ్ కేసు విచారణ తదుపరి కోర్టు వెలువరించే ఉత్తర్వులకు లోబడి జిల్లాల పునర్విభజన ఉంటుందని కోర్టు పేర్కొంది.

09/30/2016 - 03:53

హైదరాబాద్/ చాదర్‌ఘాట్, సెప్టెంబర్ 29: ట్విట్టర్‌లో ఓ లెక్చరర్ పోస్ట్ చేసిన ఐసిస్ ప్రస్తావన కలకలం రేపుతోంది. దీంతో హైదరాబాద్‌లో మళ్లీ ఐసిస్ కదలికలపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని ఎంఎస్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ గత మంగళవారం సాయంత్రం గం. 530లకు కళాశాల నుంచి వెళ్లాడు. అదే రోజు వరంగల్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

09/30/2016 - 04:07

హైదరాబాద్, సెప్టెంబర్ 29:పాలమూరు ప్రాజెక్టును ముందుగా అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. పాలమూరు ప్రాజెక్టుపై మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. ఇది కొత్త ప్రాజెక్టు అని ఆంధ్ర వాదించగా, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టే అని తెలంగాణ వాదించింది. పాత ప్రాజెక్టే అని అపెక్స్ కౌన్సిల్‌లో ఆధారాలు చూపించారు.

09/30/2016 - 03:50

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైనిక బలగాల మిలిటరీ చర్యలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై మిలిటరీ దాడులు అవసరమన్నారు. భారత సైనికులకు అండగా ఉంటామన్నారు. ఉగ్రవాదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించే ప్రసక్తిలేదన్నారు.

09/30/2016 - 03:50

పటన్‌చెరు, సెప్టెంబర్ 29: మెదక్ జిల్లా పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంటిపై గురువారం ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 24 మంది ఆదాయపన్ను అధికారుల బృందం పట్టణంలోని ఐదుచోట్ల దాడులు నిర్వహించింది. ఇవి కాకుండా మిగతా తొమ్మిది ఏకాలంలో దాడులు జరిపినట్లు సమాచారం.

Pages