S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/30/2016 - 03:49

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణలో ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 19,20 తేదీల్లో సివిల్ ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా నవంబర్ 27న కమ్యూనికేషన్ ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష జరుగుతుందని బోర్డు పేర్కొంది.

09/30/2016 - 03:49

హైదరాబాద్, సెప్టెంబర్ 29: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ పరిధిలో అక్రమ కట్టడాలు, నిర్మాణాలను కూల్చే ముందు యజమానులకు నోటీసులు ఇచ్చి, వారి వివరణ తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కోర్టులో పిటిషన్లు దాఖలుచేసిన వారికే స్టే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.

09/30/2016 - 03:48

హైదరాబాద్, సెప్టెంబర్ 29: నేటి నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సారి మంచి వర్షాలు కురవడం వల్ల చెరువులన్నీ నిండాయని, గ్రామాలలో జలకళ ఉట్టిపడటంతో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసిందని ముఖ్యమంత్రి అన్నారు.

09/29/2016 - 08:52

కరీంనగర్, సెప్టెంబర్ 28: ఉత్తర తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలాంటిదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టే కాక మరెన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ అనాదిగా కృషి చేస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చిందంటే కాంగ్రెస్ ఘనతేనని అన్నారు.

09/29/2016 - 08:50

సంగారెడ్డి, సెప్టెంబర్ 28: వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తెలంగాణాలోని రైతులు వ్యక్తిగతంగా పంటలను సాగు, దిగుబడులు చేస్తున్నారని, కానీ సామూహికంగా కొనసాగిస్తే ఫలితం సత్వరమే వస్తుందని సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల రైతులకు పాడి, పంటలపై ప్రత్యేక పాఠాలు బోధించారు.

09/29/2016 - 07:40

హైదరాబాద్, సెప్టెంబర్ 28: చిన్న తరహా ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది 2 లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడిసి) అధికారులను ఆ శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో బుధవారం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. టిఎస్‌పి పథకం కింద కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రూ.

09/29/2016 - 07:39

హైదరాబాద్/రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యలో తగిన మార్పులు అవసరమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి, విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ ఎస్ రాథోర్ అన్నారు.

09/29/2016 - 07:38

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మల్లన్నసాగర్ ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల కింద జీవో 123 కింద సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు చేపట్టిన సహాయక చర్యలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది.

09/29/2016 - 07:37

హైదరాబాద్, సెప్టెంబర్ 28: పేద విద్యార్థుల కోసం కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ముద్రించిన ‘టు ఇన్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్’ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి , మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్యే కోణప్ప పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
అమెరికా వర్శిటీలతో గీతం అవగాహన

09/29/2016 - 07:36

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుతామని రాష్ట్ర పర్యాటక మంత్రి ఎం. చందూలాల్ తెలిపారు. బతుకమ్మ సంబురాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కార్యక్రమాలను సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ నెల 30 నుండి అక్టోబర్ 9 వరకు పదిరోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

Pages