S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/29/2016 - 06:47

హైదరాబాద్, సెప్టెంబర్ 28: కొత్త జిల్లాల నేపథ్యంలో 3252 పోస్టులు అవసరమని సర్కారు ప్రాథమికంగా లెక్క తేల్చింది. జిల్లాల పునర్విభజన కోసం అన్ని శాఖల్లో పోస్టులు పెరిగే అవకాశముంది. దీనికోసం అర్హతల మేరకు పదోన్నతులు కల్పించి, పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవిన్యూ, పోలీసు శాఖల్లో ఎక్కువ పోస్టులు అవసరమని అధికారుల నుంచి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది.

09/29/2016 - 06:45

హైదరాబాద్, సెప్టెంబర్ 28: అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఎవరినీ ఉపేక్షించాల్సిన పనిలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రే భరోసా ఇచ్చినా, పాతబస్తీవైపు యంత్రాంగం ఎందుకు కదలడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పాతబస్తీలో కూల్చివేతలు కనిపించక పోవడంతో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో 28.6వేల అక్రమ నిర్మాణాలు నాలాలపైనే ఉన్నాయన్నది ఏడేళ్ల క్రితంనాటి గ్రేటర్ నివేదిక.

09/29/2016 - 06:03

సంగారెడ్డి, సెప్టెంబర్ 28: సువిశాలమైన భారతదేశ పరిపాలనను అప్పగిస్తే ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ అద్భుతంగా ముందుకు నడిపించారు. అదే తరహాలో కుటుంబ పెత్తనాన్ని విజయవంతంగా ముందుకు నడిపించే బాధ్యతను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మహిళలు స్వీకరించాల్సిన అవసరం ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

09/28/2016 - 07:52

ముస్తాబాద్, సెప్టెంబర్ 27: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో 700 ఎకరాల సా మర్థ్యం గల పెద్దచెరువు జలకళ మూడు రోజులు ముచ్చటగొల్పి, నాల్గవ రోజున చెరువు కట్ట తెగిపోయింది. శిఖంలో చుక్కనీరు లేకుండా పోయింది. వరద ఉద్ధృతి భారీ నష్టాన్ని మిగిల్చింది. అదృష్టవశాత్తు మంగళవారం తెల్లవారుజామున చెరువుకట్ట తెగిపోవడం, జనసంచారం లేని సమయం కావడంతో ఎలాంటి జననష్టం వాటిల్లలేదు.

09/28/2016 - 07:51

సిద్దిపేట, సెప్టెంబర్ 27 : సిద్దిపేటలో హెచ్‌సిఎ ఆధ్వర్యంలో సెంట్రల్ అకాడమీ ఏర్పాటు చేసి ఈప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తానని హెచ్‌సిఎ అధ్యక్షు డు, మాజీ టెస్టు క్రికెటర్ అర్షద్ ఆయూబ్ వెల్లడించారు. సిద్దిపేట మినీస్టేడియాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. ఈ మైదానంలో రంజీపోటీలు నిర్వహిస్తానని హామీనిచ్చారు.

09/28/2016 - 07:51

సిద్దిపేట, సెప్టెంబర్ 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అమలులో భాగంగా ఆదర్శంగా నిలిచి పరిశుభ్ర పట్టణంగా ఎంపికైన స్వచ్ఛ పురస్కార్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ రాహుల్ ప్రతాప్‌సింగ్ మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సుకు, కమిషనర్ రమణాచారికి అందజేశారు.

09/28/2016 - 07:50

హైదరాబాద్/కాచిగూడ, సెప్టెంబర్ 27: తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అశయాలను సాధించుకునే దిశగా ప్రయత్నం చేస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖమంత్రి జోగు రామన్న అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతిని మంగళవారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించారు.

09/28/2016 - 07:49

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పివి నరసింహారావువెటర్నరీ వర్శిటీలకు సంబంధించిన బైపిసి స్ట్రీం కోర్సులకు సంయుక్త కౌనె్సలింగ్ అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్‌కుమార్ తెలిపారు.

09/28/2016 - 07:49

గట్టు, సెప్టెంబర్ 27: మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండల పరిధిలోని గంగిమాన్‌దొడ్డి గ్రామంలోమంగళవారం ఉద యం తమ వ్యవసాయ పొ లం దగ్గర ఇద్దరు రై తులు విద్యుతాఘాతానికి దుర్మరణం చెందా రు. రోజు మాదిరిగా రైతులు తమ వ్య వసాయ పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా సర్వీస్ వైర్‌కు షార్ట్‌సర్క్యూట్ రావడంతో కరెన్న అలియాస్ అడివన్న (38) కరెంట్ షాక్‌కు గురయ్యాడు.

09/28/2016 - 07:48

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్థానం ఆదాయం ఎన్నడూ లేనంతగా మంగళవారం కనిష్టస్థాయికి పడిపోయింది. గత కొంతకాలంగా తగ్గు ముఖం పడుతూ వస్తున్న ఆదాయం మంగళవారం మరింత తగ్గింది. మంగళవారం యాదాద్రిలో వివిద విభాగాల నుండి 2 లక్షల 66 వేల 240 రూపాయల ఆదాయం సమకూరింది. బాలాలయంలో దర్శనాలు ప్రారంభమై సుమారు 6 మాసాలు కావస్తోంది.

Pages