S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/27/2016 - 03:46

హైదరాబాద్, సెప్టెంబర్ 26: మహానగరాన్ని కుదిపేసిన తర్వాత ఇపుడిపుడే జనజీవనం కొలుకుంటుంది. వర్షాలు తగ్గటం, భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగియటంతో జనజీవనం క్రమంగా గాడిన పడుతోంది. తరచూ భారీవర్షాల కారణంగా శివార్లలోని నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాలు నీట మునగగా, వీటిలో నిజాంపేట, మహేశ్వరినగర్‌లు సోమవారం కూడా నీటిలోనే ఉన్నాయి.

09/27/2016 - 03:43

సదాశివపేట, సెప్టెంబర్ 26: తుపాను సృష్టించిన బీభత్సానికి తాము సాగు చేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైందని, ఇందుకుగాను ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని తమకే ఇప్పించాలని లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామంటూ మెదక్ జిల్లా సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కౌలు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.

09/27/2016 - 03:41

గద్వాల, సెప్టెంబర్ 26: దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల చీరకు, నేతన్నకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని టెక్స్‌టైల్ కమిషనర్ కవితగుప్తా, కార్యదర్శి రేష్మివర్మ, డెవలప్‌మెంట్ కమిషనర్ అలోక్‌కుమార్ బృందం తెలిపింది. సోమవారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో వారు సమావేశమయ్యారు.

09/27/2016 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి కొత్త రూట్లలో పలు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఆర్టీసి ఐదు కొత్త రూట్లలో బస్సులు ప్రారంభించినట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు.

09/27/2016 - 03:38

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గత రెండు వారాల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 14 ఈవ్‌టీజ్, 12 పిటీ కేసులు నమోదేనట్టు షీటీమ్స్ ఏసిపి స్నేహిత తెలిపారు. అయితే వీరిలో కొందరికి కౌనె్సలింగ్ నిర్వహించామని, మరికొందరిని రిమాండ్‌కు తరలించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎవరైనా మహిళలను, యువతులను వేధిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని, వాట్సాప్ నెం.

09/27/2016 - 03:37

కోదాడ, సెప్టెంబర్ 26: ప్రకృతి అనుకూలించకపోవడంతో కరవుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు, బతుకమ్మలకు మాత్రం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని తెలంగాణ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ ధ్వజమెత్తారు. కోదాడలో సోమవారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు.

09/27/2016 - 03:31

హైదరాబాద్, సెప్టెంబర్ 26: మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సాధారణ వర్షపాతానికే చెరువులకు గండిపడి తెగేవి. కానీ అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నా మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరించిన చెరువులు నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఇలానే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకం కింద 3821 చెరువులను పునరుద్ధరించగా, 1904 అలుగు పోశాయి.

09/27/2016 - 03:29

సిద్దిపేట, సెప్టెంబర్ 26: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట పట్టణానికి కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలను వివిధ మాధ్యమాలతో సర్వే చేయించిన అనంతరం మెదక్ జిల్లా సిద్దిపేటను ఓడిఎఫ్‌గా గుర్తించారు.

09/27/2016 - 03:27

హైదరాబాద్, సెప్టెంబర్ 26: సిబిఐ వాదన విన్న తర్వాతనే నరుూం కేసులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సోమవారం నాడు స్పష్టం చేసింది. సిపిఐ నాయకుడు డాక్టర్ కె నారాయణ దాఖలు చేసిన ప్రజావ్యాజ్యం కేసు హైకోర్టు ముందుకు వచ్చింది.

09/27/2016 - 03:26

హైదరాబాద్, సెప్టెంబర్ 26: నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని సుంకిశాలలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సుంకిశాల వేంకటేశ్వరస్వామి ఆలయానికి వస్తున్న ఆదాయానికంటే ఖర్చు ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో ఆలయం నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని, ఆలయ చైర్మన్ ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు.

Pages