S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/21/2016 - 05:55

హైదరాబాద్, ఆగస్టు 20: నదీజలాల వినియోగంపై ఈ నెల 23 న మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియా ప్రతినిధులకు వివరిస్తూ, మహారాష్టత్రో కుదరబోయే ఒప్పందం చారిత్రాత్మకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

08/21/2016 - 05:54

హైదరాబాద్, ఆగస్టు 20: ఫీజుల పెంపు, సవరింపు, కౌనె్సలింగ్, సీట్ల భర్తీ వంటి పలు అంశాలపై ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి శనివారం నాడు చర్చలు జరిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో రాష్ట్రంలోని పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎపిలో ఉన్నట్టు ఫీజులను పెంచాలని కోరారు.

08/21/2016 - 05:54

హైదరాబాద్, ఆగస్టు 20: భరత జాతిని కాపాడేది ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మాత్రమేనని బిజెపి ఉపాధ్యక్షుడు, ఎంపి వినయ్ సహస్రబుద్ధి అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన జనమంచి గౌరీశంకర్ 14వ స్మారకోపన్యాసం చేశారు.

08/21/2016 - 05:53

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన అనర్హత పిటీషన్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పరిశీలనలో ఉన్నాయని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు.

08/21/2016 - 05:52

హైదరాబాద్, ఆగస్టు 20: దసరాకు కొత్త జిల్లాలు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలు మొత్తం 27 జిల్లాలుగా అవుతాయి. అయితే జిల్లా పరిషత్తులు మాత్రం మరో రెండున్నర ఏళ్లపాటు ప్రస్తుతం ఉన్న తొమ్మిది అలాగే కొనసాగుతాయి. మండలాధ్యక్షులు మొదలుకొని జిల్లా పరిషత్తుల వరకు ప్రస్తుతం ఉన్న విధానం యధావిధిగా కొనసాగుతుంది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలకు తొమ్మిది జిల్లా పరిషత్తులు ఉన్నాయి.

08/21/2016 - 05:43

మహబూబ్‌నగర్, ఆగస్టు 20: కృష్ణా పుష్కరాల్లో భాగంగా కృష్ణమ్మ ఒడిలో భక్తకోటి జనం పుణ్యస్నానాలు చేశారు. కృష్ణా పుష్కరాలు ప్రారంభమై తొమ్మిదవ రోజునాటికి ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే కృష్ణా పుష్కరాల్లో కోటి మందికిపైగా భక్తులు పుణ్యస్నానం చేసి పునీతులయ్యారు. పుష్కరాల్లో భాగంగా శనివారం దారులన్ని పరుగెత్తాయి. దింతో 44 జాతీయ రహదారిపై వాహనాల రద్ది ఏర్పడింది.

08/21/2016 - 05:40

మహబూబ్‌నగర్, ఆగస్టు20: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు బేష్‌గా ఉన్నాయని, లక్షలాధి మంది భక్తులు పుష్కర స్నానానికి వస్తున్నప్పటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగాన్ని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొనియాడారు.

08/21/2016 - 05:36

ఆసిఫాబాద్, ఆగస్టు 20: మాజీ మంత్రి కొట్నాక భీంరావు విగ్రహం ఏర్పాటు విషయంలో సబ్‌కల్టెర్, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. విగ్రహ ఏర్పాటు పనులకు అనుమతులు తెచ్చుకోవాలని సబ్‌కలెక్టర్... తమ ప్రభుత్వంలో మీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే ఇద్దరూ భీష్మించుకొని కూర్చోవడం అటు అధికారులు... ఇటు రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా పరిణమించింది.

08/21/2016 - 05:34

చిగురుమామిడి, ఆగస్టు 20: ప్రేమ పేరుతో ఓ యువతిని వంచించిన ప్రబుద్ధుడు పెళ్లికి మాత్రం నిరాకరించాడు. ఐదు లక్షలు తీసుకొస్తేనే పెళ్లి చేసుకుంటానని దబాయంచడంతో మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకి వెళ్తే..

08/21/2016 - 05:33

నల్లగొండ, ఆగస్టు 20: కృష్ణా పుష్కర ఘాట్‌లు తొమ్మిదవ రోజు పుష్కర పుణ్య స్నానాలకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో జనజాతరను తలపించాయి. కృష్ణావేణి జన ప్రవాహంతో సాగుతుందన్నట్లుగా తీరం వెంట మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్, అడవిదేవులపల్లి, ధర్శేశిపురం, ఛాయ సోమేశ్వర, ఆజ్మాపూర్, నేరడుచర్ల మహంకాళీఘాట్, మేళ్లచెర్వు కిష్టాపురం, వజినేపల్లి పుష్కర ఘాట్‌లు భక్తజనం పుష్కర స్నానాలతో పొటెత్తాయి.

Pages