S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/21/2016 - 05:31

సిరిసిల్ల, ఆగస్టు 20: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా సాధన కోసం చేపట్టిన పట్టణ బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు పలు విధ్వంసాలు చేపట్టినా పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారు. బంద్ సందర్భంగా మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. అంబేద్కర్ చౌక్‌లో మంత్రి కె.తారకరామారావు భారీ కటౌట్‌ను ఆందోళనకారులు పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.

08/20/2016 - 18:17

హైదరాబాద్: తనకు మంచి స్నేహితుడైన సినీనటుడు పవన్‌కల్యాణ్‌తో హిట్ సినిమా తీయాలని ఉందని కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి శనివారం మీడియాతో అన్నారు. పవన్‌ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలు తప్ప అనేక ప్రజాసమస్యల గురించి తామిద్దరం చర్చించామన్నారు. ఎపి, తెలంగాణ, కర్నాటకలో వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు, ఇతర సమస్యల గురించి మాట్లాడామన్నారు.

08/20/2016 - 18:16

హైదరాబాద్‌: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ నెల 22న హైదరాబాద్‌ వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భారీ వూరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

08/20/2016 - 17:55

హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయం తీసుకుంటామని, తుది నోటిఫికేషన్ విడుదల చేసే ముందు మళ్లీ అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 1974 ఏపీ కొత్తజిల్లాల చట్టం ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

08/20/2016 - 17:51

హైదరాబాద్‌: తెలుగువారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధును గౌరవించుకోవడం భారతీయులుగా మన కర్తవ్యమని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు.

08/20/2016 - 17:15

మహబూబ్‌నగర్‌: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని న్యాయవాదుల జేఏసీ, అఖిలపక్షం నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పునరాలోచించి, రెవెన్యూ డివిజన్ల జాబితాలో కల్వకుర్తిని చేర్చాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి పాల్గొన్నారు.

08/20/2016 - 17:04

హైదరాబాద్‌: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం అఖిల పక్ష సమావేశం ముగిసింది. మరో రెండు దఫాలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. అఖిల పక్ష సమావేశం అనంతరం తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయ్యింది.

08/20/2016 - 16:39

మెదక్: కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబసభ్యులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కోరారు. రామకృష్ణారెడ్డి సూపైడ్ నోట్‌లో పేర్కొన్న వారిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఎస్సై ఆత్మహత్యపై డీఐజీ అకున్‌ సబర్వాల్ కుకునూరుపల్లి పొలీసు స్టేషన్‌లోని సిబ్బందిని ప్రశ్నించారు.

08/20/2016 - 15:49

మెదక్‌ : మెదక్‌ జిల్లా కుక్కునూరుపల్లి ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధిపేట డీఎస్పీ శ్రీధర్‌ను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

08/20/2016 - 15:10

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ రామ్మోహన్‌ ఎదుటే ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి శనివారం బాహాబాహీకి దిగారు. మైలర్‌దేవపల్లిలో ఫ్లెక్సీ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రావడంతో సమస్య సర్దుమణిగింది.

Pages