S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/17/2016 - 11:32

హైదరాబాద్ : అదనపు కట్నం తీసుకురావాలని లేకుంటే వ్యభిచారం చేసి సంపాదించాలని భర్తతోపాటు అత్తమామల వేధింపులు తాళ లేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని ఎల్లారెడ్డిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంగా పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామల నుంచి వేధింపులు మొదలైయ్యాయి.

08/17/2016 - 11:28

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఏడుగురు నైజీరియన్లను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 73 గ్రాముల కొకైన్తోపాటు 5 గ్రాముల హెరాయిన్, 2 ల్యాప్టాప్లు, 15 సెల్ఫోన్లతోపాటు 33,600 నగదు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

08/17/2016 - 11:25

హైదరాబాద్ : పాతబస్తీ మాదన్నపేటలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆరుగురు రౌడీషీట్లర్లతోపాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సరైన పత్రాలు లేని 44 బైకులతోపాటు మూడు ఆటోలను సీజ్ చేశారు. సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు.

08/17/2016 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 16: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఒకవైపు పనులు వేగంగా సాగిస్తుండగా, మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణల మధ్య మహా ఒప్పందానికి సర్వం సన్నద్ధం అయింది. మరోవైపు టెండర్ల ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుంది. సూత్రప్రాయంగా మహారాష్ట్ర ఆమోదం తెలపడంతో తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ పనులు, ఎత్తిపోతలకు అవసరం అయిన పంపులు, పరికరాలను సమకూర్చుకుంటున్నది.

08/17/2016 - 05:34

హైదరాబాద్, ఆగస్టు 16: వర్షాకాలం ముగిసేలోగా హరితహారం కార్యక్రమ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం కలెక్టర్లతో రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. థర్డ్ పార్టీతో ఎప్పటికప్పుడు తనఖీలు చేయించి లోటుపాట్లను సరిదిద్దాలని సిఎస్ సూచించారు.

08/17/2016 - 05:34

హైదరాబాద్, ఆగస్టు 16: మెదక్ జిల్లా నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు నిమిత్తం భూముల కొనుగోలుకు ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 123 కింద భూమి కొనుగోలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది.

08/17/2016 - 05:33

హైదరాబాద్, ఆగస్టు 16: రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఒకవైపు ప్రాజెక్టులు అడ్డుకుంటూ మరోవైపు రైతు గర్జనలా అని నిలదీశారు. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపిలు వినోద్, కవిత, బాల్క సుమన్ వేరువేరుగా మాట్లాడారు.

08/17/2016 - 05:32

హైదరాబాద్, ఆగస్టు 16: నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం చెప్పిన లెక్కలన్నీ అవాస్తవాలేనని ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం (17న) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమైంది. బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ వద్ద ఉన్న రావి నారాయణ రెడ్డి మెమోరియల్ హాలులో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి 150 స్లైడ్లను సిద్ధం చేశారు.

08/17/2016 - 05:32

హైదరాబాద్, ఆగస్టు 16: ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకాలను మిషన్ భగీరథతో అనుసంధానించాలని పంచాయితీరాజ్ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ ఎస్పీ సింగ్ అధికారులకు ఆదేశించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, జిల్లాల్లో వరల్డ్ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకాల పురోగతిపై సచివాలయంలో ఎస్‌పి సింగ్ చర్చించారు.

08/17/2016 - 05:31

హైదరాబాద్, ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ (కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్) కమిషనర్‌గా ఐపిఎస్ అధికారి (1991) సి.వి. ఆనంద్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మపేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆనంద్ ఇటీవలి వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు.

Pages