S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/06/2016 - 07:22

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 5: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు నాగేశ్వరరావు (79) గుండెపోటుతో శుక్రవారం ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. మూడుసార్లు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనేరు నాగేశ్వరరావు, ఉమ్మడి రాష్ట్రంలో చిన్నతరహా నీటిపారుదల మంత్రిగా పనిచేశారు.

08/06/2016 - 07:07

హైదరాబాద్/నాచారం, ఆగస్టు 5: ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనా రంగానికి పెద్దపీట వేస్తూ శతాబ్ది ఉత్సవాలతో ప్రపంచఖ్యాతిని అర్జిస్తామని వైస్ చాన్స్‌లర్ వి రామచంద్రం అన్నారు. వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన సందర్భంగా శుక్రవారం పరిపాలనా భవనం ఐసిఐసిఆర్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు.

08/06/2016 - 07:00

హైదరాబాద్, ఆగస్టు 5: ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నాయన్న ఆభియోగాలపై జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారి, వారి బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ దాడులు నిర్వహించింది. ఖైరతాబాద్‌లోని జిహెచ్‌ఎంసి సర్కిల్ -10 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారి (అసిస్టెంట్ సిటీ ప్లానర్)గా ఎ.సంతోష్ వేణు పనిచేస్తున్నారు.

08/06/2016 - 06:59

హైదరాబాద్, ఆగస్టు 5: సంస్కృతం, తెలుగు భాషల్లో పండితులు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తండ్రి అయిన కె రాఘవాచారి(90) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. పాదుకా సహస్రం సంస్కృత గ్రంధానికి రాఘవాచారి వ్యాఖ్యానం ప్రఖ్యాతి చెందింది. పలు సంస్కృత గ్రంథాలకు రాఘవాచారి వ్యాఖ్యానాలు చేశారు. తెలుగులోనూ పలు గ్రంథాలు ఆయన రచించారు. భాగవత సంప్రదాయాలను చివరి వరకు పాటించారు.

08/06/2016 - 06:58

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో స్వైన్ ఫ్లూ ప్రభావం తిరిగి కనిపిస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు స్వైన్ ఫ్లూ అనుమానంతో 99 మంది నమూనాలు పరీక్షించగా వీరిలో ముగ్గురిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా స్వైన్ ఫ్లూగా నిర్ధారించలేదు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలోనూ స్వైన్ ఫ్లూ వ్యాధి చికిత్సకు అవసరం అయిన మందులు అందుబాటులో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

08/06/2016 - 06:45

హైదరాబాద్, ఆగస్టు 5: నిర్మాణం పూరె్తై ఎంతోకాలంగా గృహ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వేలాది గృహాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వేలం ద్వారా ఇళ్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన గృహాలను చాలాకాలంగా ఎవరికీ కేటాయించకుండా వదిలేశారు. 3,718 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

08/06/2016 - 06:44

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 8 (1)కి అనుగుణంగా భూసేకరణ విధానాన్ని రూపొందించి కోర్టుకు సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను సింగిల్ హైకోర్టు జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు.

08/05/2016 - 18:09

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై నగరంలో శుక్రవారం జరిగిన చర్చా వేదికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బషీర్‌బాగ్‌లోని పిజి లా కాలేజీలో చర్చావేదిక ప్రారంభం కాగానే మాల సంక్షేమ సంఘం కార్యకర్తలు తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను నిలదీశారు. చర్చావేదికను వ్యతిరేకిస్తున్న వీరు నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తలకు గాయం కాగా వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.

08/05/2016 - 16:20

నల్లగొండ: యాదాద్రిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు సాగింది. లక్ష సంతకాలతో కూడిన 10 వేల పోస్టు కార్డులను సీఎం కేసీఆర్కు పంపించారు.

08/05/2016 - 15:59

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులతో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ముఖాముఖి ప్రారంభమవుతుంది. బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు, జస్టిస్ చంద్రకుమార్, టి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వామపక్షాల నేతలు పాల్గొనున్నారు.

Pages