S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/05/2016 - 12:05

హైదరాబాద్ : . ఏపీ సచివాలయం ఉద్యోగులు వెలగపూడికి తరలివెళ్తూ ఉండటంతో వారికి వీడ్కోలు విందు ఇవ్వాలని తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరురాష్ట్రాల సీఎస్‌లు, అతిథులుగా ఉన్నతాధికారులు, అధికారులు హాజరుకానున్నారు. సచివాలయంలోని బతుకమ్మ ప్రాంగణంలో ఏపీ ఉద్యోగులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

08/05/2016 - 11:49

ఖమ్మం: మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం గుండెపోటుతో కొత్తగూడెంలో కన్నుమూశారు. కోనేరు మృతి పట్ల మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ నేత తుళ్లూరి భద్రయ్య సంతాపం తెలిపారు.

08/05/2016 - 05:51

సంగారెడ్డి, ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 123 జివో భూ సేకరణను హైకోర్టు రద్దు చేయడంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సేకరణ కార్యక్రమం మళ్లీ మొదటికొచ్చింది. రెండు నెలల పాటు నిరంతరాయంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగగా, పోలీసుల లాఠీ చార్జి, గాల్లోకి కాల్పులు జరిపి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

08/05/2016 - 05:50

కోహెడ, ఆగస్టు 4: కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని తంగళ్లపల్లి మ్రోయతుమ్మెద వాగు ఒడ్డున కిష్టమ్మ గుట్టపై కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి గర్భాలయంలో ఓ కూర్మం (తాబేలు) గురువారం అదే పనిగా ప్రదక్షిణలు చేసింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రదక్షిణలు చేసిన తాబేలు విగ్రహాల ఎదురుగా ఉంది.

08/05/2016 - 05:47

చండూరు, ఆగస్టు 4 : పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఏ పదవినై నా చేపట్టడానికి తాను సిద్ధమేన ని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా చండూరు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలందరూ గ్రూపులను పక్కన బెట్టి సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

08/05/2016 - 05:47

హైదరాబాద్, ఆగస్టు 4: జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను గురువారం సచివాలయంలోని తన కార్యా లయంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు సత్కరించారు. వ్యక్తిగత బహుమానంగా ఒక లక్షా 11వేల 111 రూపాయల నగదుతో పాటు శాలువతో వెంకటయ్యను సత్కరించారు. దీంతో పాటు జిహెచ్‌ఎంసి నుండి మరో లక్ష రూపాయల చెక్కు అందజేశారు.

08/05/2016 - 05:45

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 4: కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకం, త్రివర్ణ తోరణాలను గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పనికి రాని మరుగుదొడ్డిలో పడేసి జాతి ప్రతిష్టను అవమాన పర్చడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ‘ఆంధ్రభూమి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘త్రివర్ణ తోరణంపై ఇదేనా గౌరవం..?

08/05/2016 - 05:43

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నల్గొండ జిల్లా మోత్కూరులో ఇకత్ చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా టిఆర్‌ఎస్ ఎంపి బూర నరసయ్య గౌడ్‌కు రాసిన లేఖలో తెలిపారు. మోత్కూరులో ఒక కోటీ 73 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఇకత్ చేనేత క్లస్టర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తమ వంతు కింద 143.38 లక్షల రూపాయలు ఇస్తుందని మిశ్రా తమ లేఖలో పేర్కొన్నారు.

08/05/2016 - 05:42

వినాయక్‌నగర్, ఆగస్టు 4: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడేందుకు మహారాష్టక్రు చెందిన దొంగల ముఠా విఫలయత్నం చేసింది. బుధవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో నాల్గవటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ట్రాన్స్‌కో ఎ.ఇ శ్రీహరి ఇంటికి నలుగురు సభ్యులు గల దొంగలు చేరుకున్నారు. శ్రీహరి అమెరికా పర్యటనలో ఉండగా, ఆయన కుటుంబీకులు ఇంట్లో ఉంటున్నారు.

08/05/2016 - 05:41

గజ్వేల్, ఆగస్టు 4: ప్రధాని నరేంద్రమోదీ మెదక్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీజి బృందం గురువారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించింది. ప్రధాని గజ్వేల్ మండలం కోమటిబండలో మిషన్ భగీరథతోపాటు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈనెల 7న వస్తున్న సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డిఐజి నేతృత్వంలో అధికారుల బృందం గురువారం ఏర్పాట్లు పరిశీలించింది.

Pages