S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/04/2016 - 07:47

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 3: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 9 నుంచి జాతీయ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి పల్లెలో పండుగ వాతావరణం మధ్య వేడుకలు జరిపేందుకు సిద్ధం చేశారు. జాతీయ జెండా, మూడు రంగులు కలిగిన తోరణాలతో ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు ముస్తాబవుతాయి.

08/04/2016 - 07:23

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభ విజయవంతం కావాలని బిజెపి రాష్ట్ర నాయకులు గురువారం సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా బిజెపి ఈ నెల 7న ఎల్‌బి స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఈ యాగం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నది.
కేంబ్రిడ్జి ఇంగ్లీష్‌తో ‘టాస్క్’ ఒప్పందం

08/04/2016 - 07:22

హైదరాబాద్, ఆగస్టు 3: భూసేకరణ కోసంతెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జివో 123ని హైకోర్టు రద్దువేయడం పట్ల ప్రతిపక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. జీవో నెం.123 ప్రతులను తగులబెట్టారు.
ఇది రైతుల విజయం: టి.పిసిసి

08/04/2016 - 09:03

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతులనుంచి నేరుగా భూములు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో123ను కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123 జారీ చేసిన విషయం తెలిసిందే.

08/04/2016 - 06:41

హైదరాబాద్, ఆగస్టు 3: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగర రోడ్లన్నింటినీ పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నిజాం కాలంనాటి రోడ్లనే ఇప్పటికీ వాడుతున్నట్టే, తాము పునర్నిర్మించే రోడ్లనే మరో వందేళ్లపాటు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామన్నారు.

08/04/2016 - 06:38

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో 1700 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సాంఘిక గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో 1794 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆమోదించిన 758 పోస్టులకు ఇవి అదనంగా భర్తీ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

08/04/2016 - 06:06

హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలో ఎన్నడూ ఎక్కడా లేనివిధంగా చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణలో 8మంది వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను హైకోర్టు కొట్టివేయడం విద్యావేత్తలను ఆశ్చర్యపరిచింది.

08/03/2016 - 18:03

హైదరాబాద్: 123 జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇది రైతులు, రైతు కూలీల విజయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. 123 జీవో రద్దు సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సంబరాలు నిర్వహించింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్ కళ్ళు తెరవాలని ఉత్తమ్ సూచించారు.

08/03/2016 - 18:01

హైదరాబాద్: ప్రధానమంత్రి ఈ నెల 7న రాష్ట్రానికి రానున్న సందర్భంగా గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. మిషన్ భగీరథను ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో ప్రధాని ప్రారంభిస్తారు. వివిధ కార్యక్రమాలను మోదీ గజ్వేల్ నుంచే ప్రారంభిస్తారు.

08/03/2016 - 17:56

హైదరాబాద్‌ : 123 జీవో ద్వారా మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం భూ సేకరణ ప్రక్రియ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తోంది. 2013 భూ సేకరణ చట్టం అమలుకు ప్రయత్నించవచ్చు. తీర్పుపై ఆపీళ్లకు వెళ్లి భూసేకరణ కొనసాగించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించవచ్చు.

Pages