S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/03/2016 - 07:51

కరీంనగర్, ఆగస్టు 2: సాదాబైనామాల కింద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి మహమూద్ అలీ తెలిపారు.

08/03/2016 - 07:51

బాల్కొండ, ఆగస్టు 2: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 69 వేల క్యూసెక్కుల భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, ఆమ్రేడ్ రిజర్వాయర్‌ల మిగులు జలాలు తోడు కావడంతో 69 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు.

08/03/2016 - 07:50

కోహెడ, ఆగస్టు 2: పెంచి పెద్ద చేసి ప్రేమానురాగాలు పంచాల్సిన తండ్రి కన్న కొడుకును కడతేర్చాడో ఓ కసాయి. సంఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో మంగళవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోనవేని సంజీవ్ అనే వ్యక్తి తన కొడుకు రంజిత్ (12)ను పథకం ప్రకారం ముందే హతమార్చి తన తన ట్రాక్టర్ కేజివీల్ కింద పడిపోయి ప్రమాదవశాత్తు చనిపోయాడని కట్టుకథ అల్లే ప్రయత్నం పోలీస్ విచారణలో తేలింది.

08/03/2016 - 07:50

హైదరాబాద్, ఆగస్టు 2 : తెలంగాణ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు 2016-17 సంవత్సరంలో ఎంత వరకు సాధ్యమవుతుందన్న అంశంపై అధ్యయనం జరుగుతోంది. వర్షాలు బాగా ఉంటే సాధారణంగా 80 నుండి 110 లక్షల టన్నుల వరకు ఆహార పంటలు పండుతాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో అత్యధికంగా ఉత్పత్తి జరిగి రికార్డు సృష్టించిన సంవత్సరం 2013-14 వ సంవత్సరం. ఆ సంవత్సరం తెలంగాణలో 106.86 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు జరిగా యి.

08/03/2016 - 07:49

మెదక్, ఆగస్టు 2: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీషరావు విమర్శించారు. మంగళవారం మెదక్ సాయిబాలాజీ గార్డెన్‌లో జరిగిన మెదక్ నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

08/03/2016 - 07:49

కరీంనగర్/నిజామాబాద్/వరంగల్/ఆదిలాబాద్, ఆగస్టు 2: గోదావరి అంత్య పుష్కరాలలో మూడవ రోజు వివిధ పుష్కరఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం అమావాస్య కావడంతో సెంటిమెంటు గల భక్తులు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో నదీ స్నానాల కోసం రాగా, భక్తుల రద్దీ ఉదయం నుండి క్రమేపీ అధికమైంది.

08/03/2016 - 07:48

కొండపాక, ఆగస్టు 2: తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని ఎర్రవల్లి భూనిర్వాసితులు గ్రామ సమీపంలో నోటీసుబోర్డు వేశారు. మంగళవారం మండలంలోని ముంపు గ్రామమైన ఎర్రవల్లిలో నిర్వాసితులంతా భూములు ఇచ్చేందుకు సంసిద్దంగా ఉన్నామని, తమ గ్రామానికి ప్రతిపక్షాలు వచ్చి గొడవలు సృష్టిస్తూ రాజకీయాలు చేయవద్దని హెచ్చరికలు జారీచేశారు.

08/03/2016 - 07:47

జగిత్యాల, ఆగస్టు 2: కువైట్, సౌదీ అరబ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభం ఇక్కడి వలస జీవితాల్లో ఆందోళన రేకేత్తిస్తుంది. అక్కడి చమురు సంస్థలు నష్టాలను చవి చూస్తున్న క్రమంలో ఉద్యోగులను తొలగిస్తుడడంతో వలస జీవుల కుటుంబాల్లో తీవ్ర అందోళన వ్యక్తం అవుతుంది.

08/03/2016 - 07:30

హైదరాబాద్, ఆగస్టు 2: ఎంసెట్-2 లీకేజీపై వ్యవహారంలో సంబంధిత మంత్రులను బర్తరఫ్ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. మంగళవారం టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఎంసెట్ లీకేజీపై, మల్లన్న సాగర్‌లో నిర్భంధంపై వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు.

08/03/2016 - 07:26

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణకు కాంగ్రెస్ నాయకులు చేసింది ఏమీ లేదని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో కోట్లు స్వాహా చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు, రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ కావేటి సమ్మయ్యలతో కలిసి మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Pages