S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/03/2016 - 06:21

గత్యంతరం లేకనే ఎమ్సెట్-2 రద్దు ఎమ్సెట్-3 నిర్వహణ బాధాకరమే సహృదయంతో సహకరించండి
లీక్ జరిగితే తప్పని అవస్థ ఇది పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పని లేదు కేంద్రాలకు ఉచిత ప్రయాణం
ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్ రెడీ జెఎన్‌టియుకే పరీక్ష నిర్వహణ బాధ్యత మరోసారి ఎమ్సెట్‌పై సిఎం కెసిఆర్

08/02/2016 - 17:33

హైదరాబాద్‌: ఎంసెట్‌-3 పరీక్ష సెప్టెంబర్‌ 11న నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ యాదయ్యను ఎంసెట్‌-3 కన్వీనర్‌గా నియమించారు.

08/02/2016 - 17:19

హైదరాబాద్‌: కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఆర్చ్‌ (కమాన్‌) కూలడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

08/02/2016 - 13:55

కరీంనగర్‌: నకిలీ బంగారం అమ్ముతున్న ముగ్గురు ముఠా సభ్యులను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో కర్నూలుకు చెందిన మాజీ కానిస్టేబుల్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా నుంచి 3 లక్షల నగదు, మూడు బంగారం నాణేలు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

08/02/2016 - 13:49

హైదరాబాద్: ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2ను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు సిఎం కెసిఆర్ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య-ఆరోగ్య శాఖల మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు.

08/02/2016 - 12:55

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంలో మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ మంగళవారం ఉదయం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకైన విషయం తెలిసిందే.

08/02/2016 - 12:05

నల్గొండ: పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన ముఠాపై పోలీసులు దృష్టి సారించారు. బాధితులు చండూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసులో ఇంతవరకూ సలీం, రామారావు, గిరిధర్ అనే నిందితులను అరెస్టు చేశారు.

08/02/2016 - 12:04

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను ఉమ్మడి హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేసింది. లేకీజీపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ స్పందనను చూశాకే ఈ కేసులో విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

08/02/2016 - 06:16

భద్రాచలం, ఆగస్టు 1: అంత్య పుష్కరాల సందర్భం గా ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామ దివ్యక్షేత్రంలోని గోదావరి తీరం సోమవారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు జీవనది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

08/02/2016 - 06:14

మహబూబ్‌నగర్, ఆగస్టు 1: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పాలిట కంటకప్రాయుడుగా తయారయ్యారని, కేవలం ఆయన కాంట్రాక్టర్లకు మాత్రం ప్రియుడయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహబూ బ్‌నగర్ జిలాల్లో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టాలని మహబూబ్‌నగర్‌లో సోమవారం నిర్వహించిన జలసాధన దీక్షకు ఆయన హాజరయ్యారు.

Pages