S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/01/2016 - 06:26

హైదరాబాద్, జూలై 31: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీని విపక్షాలు రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకయిందనే విషయం తెలిసిన తరువాత ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.

08/01/2016 - 06:26

సూర్యాపేట, జూలై 31: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గత కొనే్నళ్లుగా సాగుతున్న నకిలీ డీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన నీలిరంగు కిరోసిన్‌కు రసాయనాలను కలిపి నకిలీ డీజిల్‌ను తయారుచేస్తున్న తీరును చూసి పోలీసు అధికారులే నిర్ఘాంతపోయారు.

08/01/2016 - 06:18

భద్రాచలం, జూలై 31: గోదావరి నది అంత్య పుష్కరాల సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరిలో భక్తులు భారీ ఎత్తున పుణ్యస్నానాలు చేశారని ఐటీడీఏ పీవో, ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు.

08/01/2016 - 06:17

హైదరాబాద్, జూలై 31:తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉన్న టిడిపిలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని ఇతర నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టిడిపి, తెలంగాణ ఏర్పడిన తరువాత వెలవెలబోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో సైతం చివరకు 15 స్థానాల్లో విజయం సాధించినా, ఆ తరువాత పరిణామాలతో పూర్తిగా బలహీనపడింది.

08/01/2016 - 05:19

ధర్మపురి, జూలై 31: ఒకనాడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న భారత దేశానికి పునర్వైభవం తేవాలని, ఇందుకు దేశాన్ని శక్తివంతంగా చేయడానికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అత్యవసరమూ, అనివార్యమని గుంటూరు దత్త పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు.

08/01/2016 - 03:42

హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్‌కు టెండర్ల ప్రక్రియ మొదలైంది. బిడ్డర్లు ఆగస్టు 20కల్లా టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం రూ. 350 కోట్లతో 83.45 మీటర్ల ఎత్తుతో ఐదు బ్లాకులుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్‌ను నిర్మించనుంది. గరిష్ఠంగా 21 నెలల కాల పరిమితిలో టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది.

08/01/2016 - 03:35

హైదరాబాద్, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాల్లో జనం పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పుష్కరాలకు పెద్దగా ప్రచారం ఇవ్వలేదు. గోదావరి ఆది పుష్కరాల సమయంలో భారీ ప్రచారం కల్పించినప్పటికీ, వర్షాలు సరిగ్గాలేక నదిలో నీరు లేక భక్తులకు అనేక ఇక్కట్లు ఏర్పడ్డాయి.

08/01/2016 - 03:33

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైందని పోలీసులకు సమాచారం అంది 12రోజులు గడిచింది. ఈనెల 19న ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకైందంటూ కొంతమంది విద్యార్థుల తల్లితండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో సిఐడి రంగంలోకి దిగింది. రాష్టవ్య్రాప్తంగా 50 వేలమంది విద్యార్ధులను క్షోభకు గురి చేసిన ఎమ్సెట్-2 లీకేజి కేసులో ఇంతవరకు సిఐడి పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

08/01/2016 - 03:31

హైదరాబాద్, జూలై 31: కొత్త జిల్లాలపై ప్రభుత్వం ప్రకటించిన రోడ్ మ్యాప్ ప్రకారం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కలెక్టర్ నుంచి ఎమ్మార్వో వరకు రెవిన్యూ శాఖ మొత్తం హరితహారంలో తలమునకలు కావడంతో కొత్త జిల్లాల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. రెండు వారాలపాటు మాత్రమే కొనసాగాల్సిన హరితహారాన్ని జూలై నెలాఖరు వరకూ పొడిగించడంతో కొత్త జిల్లాల ముసాయిదా ఖరారుపై అధికారులు దృష్టి సారించలేకపోయారు.

07/31/2016 - 22:21

నిజామాబాద్, జూలై 30: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, కనీస సదుపాయాలు కల్పించే విషయమై అధికారులు నామమాత్రంగానైనా చర్యలు చేపట్టకపోవడం పట్ల భక్తుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన గోదావరి మహా పుష్కర ఏర్పాట్లను చూసి పులకించిన వారంతా, ప్రస్తుతం అధికార యంత్రాంగం నిస్తేజ వైఖరిని చూసి ఉసూరుమంటున్నారు.

Pages