S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/31/2016 - 22:21

నిజామాబాద్, జూలై 30: తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల నుండి తీవ్ర వర్షాభావం వల్ల నీటి నిల్వలను సంతరించుకోలేకపోయిన ఎస్సారెస్పీలోకి, ఈ ఏడాది సీజన్ ఆరంభం నుండే వరద జలాల చేరిక ప్రారంభమై ప్రాజెక్టు నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.

07/31/2016 - 22:20

సంగారెడ్డి, జూలై 30: బొట్టు బొట్టునూ ఒడిసిపట్టు నీటిని కాపాడు అనే నినాదాన్ని సింగూర్ ప్రాజెక్టు అధికారులు అబాసుపాల్జేస్తున్నారు. ప్రాజెక్టులోకి కొద్దోగొప్పో వస్తున్న నీరు గేట్లకు ఏర్పడిన లీకేజీలతో దిగువకు వెళ్లిపోతుంటే కళ్లప్పగించి చూస్తున్నారే కానీ కనీస మరమ్మతులు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఉన్న నీరు సైతం అడుగంటిపోయి గేట్లు వెలవెలబోయాయి.

07/31/2016 - 22:21

ములుగు, జూలై 30 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులకు నష్టం చేకూరుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వినర్, కో కన్వినర్ చన్నారెడ్డి, ప్రహల్లాద్‌లు పేర్కొన్నారు.

07/31/2016 - 07:18

వరంగల్, జూలై 30: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/31/2016 - 07:15

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీపై, రద్దు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యులైన మంత్రులను, అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వివిధ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, వౌన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశాయి.

07/31/2016 - 07:05

హైదరాబాద్, జూలై 30: హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏజెన్సీ గుట్టు రట్టయింది. ఇద్దరు ఏజెంట్లను పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ఇండియన్ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

07/31/2016 - 07:05

హైదరాబాద్, జూలై 30: ఎంసెట్ లీకేజీలో దోషులు ఎవరున్నా శిక్షలు తప్పవని, ఇకపై ఇలాంటి తప్పు చేయాలనే ఆలోచన వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి అంశాన్ని వివాదం చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

07/31/2016 - 07:03

హైదరాబాద్, జూలై 30: ‘ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఆందోళన చేస్తామంటే ఎలా? అంతా కలసి సమష్టి నిర్ణయంతో పోరాటాలు చేయండి. మల్లన్నసాగర్‌కు ఏపిలో భూసేకరణకు తెరాస పోల్చడమేమిటి? ఏపిలోరైతులను భాగస్వాములను చేస్తున్నాం. అదే విషయం మీరు ప్రచారం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలను బిజెపి మభ్య పెడుతోంది.

07/31/2016 - 07:02

పరిగి, జూలై 30: రంగారెడ్డి జిల్లా పరిగిలో శుక్రవారం అర్ధరాత్రి నలుగురు అనుమానితులు హల్‌చల్ సృష్టించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులు వెంబడించగా దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఓ దుండగుడిని ఎస్‌ఐ పట్టుకునేందుకు యత్నించగా తోపులాట జరిగింది. ఎస్‌ఐ చెయ్యి కొరికి పారిపోయేందుకు యత్నించిన దుండగుడు పోలీసులకు చిక్కాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన సినిమా ఫక్కిలో జరిగింది.

07/31/2016 - 07:01

హైదరాబాద్, జూలై 30: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలానికి చెందిన ఉషాల యాదులు అలియాస్ యాది (33) గత కొంతకాలంగా మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడలో నివాసముంటున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

Pages