S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2016 - 14:34

వరంగల్: నగరంలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకున్నందుకు నిరసనగా ఇద్దరు అర్చకులు గురువారం నాడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. నగరంలోని భద్రకాళి ఆలయం సమీపంలోని అయ్యప్ప ఆలయాన్ని దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

07/21/2016 - 13:27

హైదరాబాద్‌: స్మార్ట్‌ సిటీస్‌ ప్రణాళిక, నమూనా, అమలులో ప్రపంచస్థాయి సంస్థ అయిన సిస్కోతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సిస్కో సంస్థ ప్రతినిధులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. స్మార్ట్‌సిటీ హైదరాబాద్‌ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిష్కారాలను ఉపయోగించి మెరుగైన సేవలు అందించేందుకు ఒప్పందం కుదిరింది.

07/21/2016 - 12:42

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. మెదక్ జిల్లా గజ్వేల్‌లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, ఆదిలాబాద్ జిల్లా పెగడపల్లిలో ఎన్‌టిపిసి విద్యుత్ ప్లాంటును మోదీ ప్రారంభిస్తారని తెలిసింది. కొద్దిరోజుల క్రితం దిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్ ప్రధానిని కలిసి తెలంగాణకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలసిందే.

07/21/2016 - 12:40

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేశారు. బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో రేపు జరిగే పరిణామాలకు ప్రధాని మోదీ, చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు.

07/21/2016 - 12:40

హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైన అనిల్‌కుమార్‌రెడ్డికి చెందిన ఇళ్లలో, కార్యాలయంలో గురువారం ఉదయం ఐటి శాఖ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, నల్గొండ, కాకినాడల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేసి ఆస్తిపాస్తులకు సంబంధించి వివరాలను సేకరించారు.

07/21/2016 - 12:38

హైదరాబాద్ : కేపీహెచ్‌బీలోని రోడ్డు నెంబర్ 5 లోని హాస్టల్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

07/21/2016 - 12:34

హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద వంటపని చేస్తున్న శరణప్ప దంపతుల కుమార్తె వైష్ణవి (5) బుధవారం మధ్యహ్నం నుంచి కనిపించడంలేదు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో నారాయణగూడ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వైష్ణవిని 14 ఏళ్ల బాలిక తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ లో కనిపిస్తుండటంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

07/21/2016 - 08:07

వరంగల్, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలంతా భాగస్వాములై ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్‌తో కలిసి బుధవారం వరంగల్ జిల్లా మేడారంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/21/2016 - 08:06

హైదరాబాద్, జూలై 20: మహాత్మా గాంధీని ఆర్‌ఎస్‌ఎస్ హత్య చేసిందని ఆరోపించిన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పేవరకు ఆయన్ను తెలంగాణలో అడుగు పెట్టనీయమని బిజెపి శాసనసభాపక్షం ఉప నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు. గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సెతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

07/21/2016 - 08:05

నల్లగొండ, జూలై 20: నల్లగొండ జిల్లాలో సాగర్ టెయిల్ పాండ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం సహాయ, పునరావాసం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టెయిల్‌పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ నిర్వాసిత గ్రామాల మీదుగా టెయిల్‌పాండ్ వరకు రెండు రోజుల పాదయాత్రను పెద్దవూర మండలం జమ్మనకోట నుండి ఆయన ప్రారంభించారు.

Pages