S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2016 - 08:04

హైదరాబాద్, జూలై 20: త్రేతాయుగంలో లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని భగ్నం చేయడానికి తాటకి, మారీచుడు, సుభాహుడు వంటి రాక్షసులు ప్రయత్నించినట్టుగానే, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను డికె అరుణ, రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డిలు అడ్డుకుంటున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.

07/21/2016 - 08:03

ఇటిక్యాల, జూలై 20: కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని మంగళవారం చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు ఎర్రవల్లి చౌరస్తాలో ప్రారంభమై బోరవెల్లి వరకు కొనసాగింది.

07/21/2016 - 08:02

హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో నాలుగు జిల్లాలను అనుసంధానం చేస్తూ 290 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డుకు అయ్యే వ్యయంపై ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ఈ రోడ్డును వీలైనంత త్వరలో చేపడతామని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం 158 కి.మీ పొడువు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసిన విషయం విదితమే.

07/21/2016 - 08:02

గజ్వేల్, జూలై 20: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆగస్టు 7న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సుదర్శన యాగంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఅర్ ప్రారంభించనుండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశమున్నట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

07/21/2016 - 08:01

సూర్యాపేట, జూలై 20: గుడ్ మార్నింగ్.. సూర్యాపేట్... వినండి.. వినండి.. ఉత్సాహంగా... ఉల్లాసంగా... అంటూ ఎఫ్‌ఎం సేవలు నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అభ్యర్థన మేరకు తక్షణమే సూర్యాపేటలో ఎఫ్‌ఎం స్టేషన్ పనులను ప్రారంభించాలని కేంద్ర సమాచార పౌరసంబంధాల, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.

07/21/2016 - 07:32

హైదరాబాద్, జూలై 20: ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర శాఖ సంతకాల సేకరణ చేపట్టింది. బుధవారం దిల్‌సుక్‌నగర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

07/21/2016 - 07:28

హైదరాబాద్, జూలై 20: డబుల్ బెడ్‌రూమ్.. పేదవాడు సొంతిట్లో పూర్తి ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యం. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మానవీయ పథకమిది. ఇందిరమ్మ ఇళ్ము, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు పూర్త్భిన్నంగా సామాన్యుడు ధీమాగా బతికేందుకు కేసీఆర్ సొంత ఆలోచనల నుంచి పుట్టిన బృహత్తర పథకమిది. అయితే అధికారుల నత్తనడక విధానాల వల్ల సందేహాలపాలవుతోంది.

07/21/2016 - 07:27

హైదరాబాద్, జూలై 20: ఉపాధ్యాయుల నియామకాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం (టిపిఇఆర్‌ఎం) కేంద్రప్రభుత్వాన్ని సూచించింది. జాతీయ నూతన విద్యా విధానం త్వరలో అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో టిపిఇఆర్‌ఎం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది.

07/21/2016 - 07:26

హైదరాబాద్, జూలై 20: గవర్నర్ ప్రమేయం లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లను నియమించేందుకు వీలు కల్పిస్తూ ఏపి యూనివర్శిటీస్ చట్టం 1991కు ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

07/21/2016 - 06:40

హైదరాబాద్, జూలై 20: రాష్ట్ర చేపగా కొర్రమీనును ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటన చేసింది. పశుసంవర్థకం, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా పేరుతో ఈమేరకు జీఓ 20 జారీ అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర చెట్టుగా జమ్మి, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర హోదా కొర్రమీను (చన్నాస్ట్రియేటస్)కు దక్కింది.

Pages