S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/21/2016 - 06:33

హైదరాబాద్, జూలై 20: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చిన తర్వాతే నీటి పంపకాలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో నీళ్లులేకుండా పంపకాలు చేపట్టలేమని బోర్డు తేల్చి చెప్పేసింది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణా యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

07/21/2016 - 06:31

మహబూబ్‌నగర్, జూలై 20: కర్ణాటక నుంచి వస్తున్న కృష్ణా వరద ఎట్టకేలకు రాష్ట్రాన్ని తాకింది. బుధవారం జూరాల ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు కనిపించాయి. అల్మట్టి, నారాయణపూర్ డ్యాంల ద్వారా విడుదల చేసిన వరద నీరు రాష్ట్రంలోకి అడుగుపెట్టడంతో జూరాల ప్రాజెక్టు నిండుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద చేరిందన్న సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసింది.

07/20/2016 - 18:25

హైదరాబాద్: పలు అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినందున ఎంసెట్-2ను రద్దు చేసి, మరోసారి ఆ పరీక్షను జరపాలని కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఎంసెట్-2 విషయంలో వెల్లువెత్తిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిసారించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

07/20/2016 - 18:24

హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచి ఇటీవల తెరాసలో చేరిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్‌ను అనర్హుడిగా ప్రకటించాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం స్పీకర్‌ను కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తెరాస పార్టీ అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు.

07/20/2016 - 18:23

విజయవాడ: తెలంగాణలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న తమ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉన్నందున అదనపు భద్రత కల్పించాలని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్‌కు అదనపు భద్రత కల్పించాలని, ఈ విషయమై గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

07/20/2016 - 18:22

హైదరాబాద్: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ సర్కారు నిర్వహించిన ఎంసెట్-2లో అక్రమాలు జరిగాయన్న ప్రచారంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇక సిఐడి విభాగం రంగంలోకి దిగనుంది. ఈ వ్యవహారంపై సిఐడి పోలీసులు విచారణ జరపాలని డిజిపి అనురాగ్‌శర్మ బుధవారం ఆదేశించారు.

07/20/2016 - 17:16

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రపక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర పండుగా మామిడి, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర క్రీడగా కబడ్డీ, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమీనును ప్రకటించి, ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07/20/2016 - 12:46

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు వస్తున్న కథనాలపై సమగ్ర విచారణ జరపాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కార్పొరేట్ కళాశాలలు ఎంసెట్-2 పేపర్‌ను లక్షలాది రూపాయలకు విక్రయించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జెఎన్‌టియు వద్ద ధర్నా చేశారు. ఆరోపణలు రుజువైన పక్షంలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

07/20/2016 - 12:43

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకు శాఖలో చోరీకి మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు వేసి ఉన్న తాళాన్ని వారు బద్దలు కొడుతుండగా ఆ అలికిడికి గ్రామస్థులు మేల్కొన్నారు. గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు.

07/20/2016 - 12:29

మహబూబ్‌నగర్‌ : మాగనూరు మండలంలో కృష్ణా, భీమ నదుల సంగమమైన తంగడిగి వద్ద కృస్ణా జలాలు బుధవారం ప్రవేశించాయి. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని కిందకి వదులుతున్నారు. ఈ నీరు మధ్యాహ్నానికి జూరాల జలాశయానికి చేరుకోనుంది.

Pages