S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/20/2016 - 12:08

హైదరాబాద్‌: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూకు ఏకపక్ష విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంయూ నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఈరోజు హరీశ్‌రావును కలిశారు.

07/20/2016 - 08:16

హైదరాబాద్, జూలై 19: వచ్చే నెల పనె్నండవ తేదీ నుంచి పనె్నండు రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

07/20/2016 - 08:14

గద్వాల, జూలై 19: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గాడ్సేగా తయారయ్యారని, నడిగడ్డ ప్రజల ఆకాంక్షల సాధన కోసం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల జిల్లా ఏర్పాటే లక్ష్యంగా జములమ్మ ఆశీర్వాదంతో జయకేతనం ఎగురవేద్దామని ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. మంగళవారం జములమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రకు వారు బయలుదేరారు.

07/20/2016 - 08:02

హైదరాబాద్, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో భాగంగా శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి మొక్కలు నాటారు. మంగళవారం చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనా చారి, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్ రావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.

07/20/2016 - 06:08

హైదరాబాద్, జూలై 19: కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ ఒప్పందాలు పూర్తి చేస్తారు. 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసేలా సిద్ధమైన ప్రణాళికను నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు.

07/20/2016 - 06:06

హైదరాబాద్, జూలై 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘానికి మంగళవారం జరిగిన ఎన్నికలు టిఎంయూ విజయదుందుభి మ్రోగించింది. ఒక్క ఖమ్మం వినా అన్ని జిల్లాల్లోనూ స్పష్టమైన మెజారిటీ సాధించింది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి జిల్లాలోనూ టిఎంయూ విజయ పరంపర కొనసాగింది. తెలంగాణవ్యాప్తంగా 95 డిపోల్లో 92 శాతం పోలింగ్ జరిగింది.

07/20/2016 - 06:05

హైదరాబాద్, జూలై 19: కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకోవడంతో వీటిని అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం అమలులో ఉన్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టంలో సమూల మార్పులతో ముసాదాను సిద్ధం చేస్తోంది. టౌన్ ప్లానింగ్ తరహాలో విలేజి ప్లానింగ్ చట్టం-2016 (గ్రామ ప్రణాళిక చట్టం) రూపొందించడంలో పట్టణ ప్రణాళికశాఖ కసరత్తు మొదలు పెట్టింది.

07/20/2016 - 05:21

హైదరాబాద్, జూలై 19: మెడికల్ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీక్ అయ్యందనే వార్తలను తెలంగాణ ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతోపాటు పరీక్ష నిర్వాహక యూనివర్శిటీ జెఎన్‌టియు అధికారులు తేలికగా కొట్టిపారేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సైతం వేర్వేరు ప్రకటనల్లో ప్రశ్నాపత్రం లీక్ కాలేదని స్పష్టం చేశారు.

07/19/2016 - 18:31

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు విచారణలో తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం తెలిపారు. లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

07/19/2016 - 18:07

హైదరాబాద్: నిపుణుల సలహాలు తీసుకోకుండా అశాస్ర్తియ పద్ధతుల్లో తెలంగాణ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను చేపడుతోందని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డిలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం సాగునీటి ప్రాజెక్టులపై మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Pages