S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/19/2016 - 05:18

బాలసముద్రం (వరంగల్), జూలై 18: కాకతీయ యూనివర్శిటి, శాతవాహన యూనివర్శిటీ పిజి కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ఈనెల 21 నుండి ప్రారంభమవుతాయని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్ వెంకయ్య తెలిపారు.

,
07/19/2016 - 05:15

నల్లగొండ, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు పది రోజుల తిరగకముందే ఎండిపోతుండడం ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యాలకు అవరోధంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద మొక్క నాటి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట హరితహారాన్ని ప్రారంభించారు.

07/19/2016 - 05:10

ఖమ్మం, జూలై 18: రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో 240కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలో ఒకేరోజు రెండు లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజునే 9 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు.

07/19/2016 - 05:08

హైదరాబాద్, జూలై 18: భూ సేకరణలో వివాదాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు, పరిశ్రమలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదులక్షల ఎకరాల భూ సేకరణ జరుగుతోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణలో మినహా ఎక్కడా పెద్దగా వివాదం తలెత్తలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉద్యమం తరువాత పలు రాజకీయ పక్షాలు మహబూబ్‌నగర్ జిల్లాలో భూ సేకరణపై దృష్టిసారించాయి.

07/19/2016 - 05:06

చిట్యాల, జూలై 18: రసాయన పరిశ్రమలో రియాక్టర్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యిల మండలంలోని పిట్టంపల్లి గ్రామ శివారులోని నోస్ పరిశ్రమలో సోమవారం రాత్రి జరిగింది. పిట్టంపల్లి గ్రామ శివారులో గల నోస్ రసాయన పరిశ్రమలో రోజువారిగా పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ వాల్వ్ వదులు కావడంతో రియాక్టర్‌లోని గ్యాస్ ఒక్కసారిగా వేగంగా బయటకు వచ్చింది.

07/19/2016 - 05:05

హత్నూర, జూలై 18: మెదక్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. హత్నూర గురుకుల పాఠశాలలో విద్యార్థుల వసతి గృహం, కొన్యాల గ్రామ సబ్‌స్టేషన్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు.

07/19/2016 - 05:02

హైదరాబాద్, జూలై 18: నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే తేదీని ఎట్టకేలకు ఖరారు చేసింది. మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రజెంటేషన్‌ను టి.కాంగ్రెస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే.

07/19/2016 - 05:01

చౌటుప్పల్, జూలై 18: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన భాస్కర్ సినిమా టాకీస్ యజమాని మంచికంటి భాస్కర్ కిడ్నాప్‌నకు యత్నించిన నరుూం ముఠాకు చెందిన నలుగురు సభ్యులతో పాటు, మరో ఇద్దరు వ్యాపారులను సోమవారం అరెస్టు చేసి రామన్నపేట కోర్టులో హాజరుపర్చగా నల్లగొండ జైలుకు రిమాండ్ చేసినట్లు చౌటుప్పల్ సిఐ నవీన్‌కుమార్ తెలిపారు.

07/19/2016 - 05:01

జగిత్యాల, జూలై 18: సిఎం కెసిఆర్ రైతాంగాన్ని విస్మరించడం గర్హనీయమని, ఈ చర్య పౌర హక్కుల ఉల్లంఘనే అని సిఎల్‌పి ఉపనేత, కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శాసన మండలి సభ్యుడు సంతోష్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

07/19/2016 - 05:00

హైదరాబాద్, జూలై 18: ఇందిర, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల పేర్లను మార్చవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఖమ్మంలో ఒక రోజు దీక్ష చేయనున్నట్లు ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. సింగరేణి పీవికే 5 టెండర్లు రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.

Pages