S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/19/2016 - 04:53

వరంగల్, జూలై 18: తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మెడిసిన్‌లో అర్హత పొందిన అభ్యర్ధులకు వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంసెట్-2లో అర్హత పొందిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఈనెల 25నుండి 30 వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుంది.

07/19/2016 - 04:52

హైదరాబాద్, జూలై 18: అంతర్జాతీయ, కేంద్ర నిఘా సంస్థలు ఉగ్రవాద సంస్థల వెబ్‌సైట్లను గుర్తించి వారి డేటాను సేకరిస్తున్న నేపథ్యంలో గుర్తుతెలియని హ్యాకర్లు రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్‌సైట్‌లను హ్యాకింగ్ చేసి సుమారు రెండు లక్షల మంది డేటా లీక్ చేసినట్టు ఎన్‌ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. ఈ హ్యాకింగ్‌తో ముస్లిమ్ మ్యాచ్ డాట్ కాం. షాదీ డాట్ కాం వెబ్‌సైట్‌లు ఉన్నట్టు తెలుస్తోంది.

07/19/2016 - 04:51

హైదరాబాద్, జూలై 18: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి నగరం అంతా వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.

07/19/2016 - 04:51

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటాను ఆన్‌లైన్‌లోనే భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా గడువు దగ్గరపడగానే తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో వ్యవహారం కాస్తా ముదురుపాకాన పడింది. ముఖ్యంగా యాజమాన్య కోటాకు మంచి గిరాకీ ఏర్పడింది.

07/19/2016 - 04:50

హైదరాబాద్, జూలై 18: రాష్ట్రంలో కొత్త ఆలయాల నిర్మాణం, చారిత్రక, పురాతన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. శిథిలావస్థలో ఉన్న ఆలయాల జీర్ణోద్ధరణ, బలహీన వర్గాల కాలనీల్లో నిర్మించే ఆలయాలకు కామన్‌గుడ్ ఫండ్ నుంచి నిధులు వెంటనే మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. సర్వశ్రేయోనిధిపై దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

07/19/2016 - 04:49

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసి కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్టవ్య్రాప్తంగా 105 డిపోలలో పనిచేస్తున్న 52,800 మంది కార్మికులు ఓటుహక్కును వినియోగించుకోనున్నట్టు కార్మికశాఖ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

07/19/2016 - 04:48

మహబూబ్‌నగర్, జూలై 18: గత నాలుగు దశాబ్దాల నుంచి తమ పొలాలకు కృష్ణా జలాలు అందించాలని మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం చేసిన పోరాటాల కల త్వరలోనే ఫలించనుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడమే ఆలస్యం. కృష్ణా జలాలను ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసి బీడువారిన పొలాల్లోకి అందించాలని ప్రభుత్వం సమయత్తమవుతోంది.

07/19/2016 - 04:47

హైదరాబాద్, జూలై 18: హీరోయిన్‌ను బెదిరించిన కేసులో డైరెక్టర్ యోగి అలియాస్ యోగేష్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి అనుకృతి హీరోయిన్‌గా పాప అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న యోగేష్ గతంలో చెప్పిన దానికి విరుద్ధంగా నటించాలంటూ అనుకృతిపై ఒత్తిడి తేసాగాడు.

07/19/2016 - 04:46

హైదరాబాద్, జూలై 18:నవజాత శిశువులకు ఉచితంగా బేబీ కిట్స్ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచడం, మందులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం 518 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లైఫ్ సేవింగ్ మెడిసిన్‌తో పాటు నవజాత శిశువులకు బేబీకిట్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి తెలిపారు.

07/18/2016 - 18:26

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై సర్వే చేయించడానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. సర్వే వివరాల ఆధారంగా ఉద్యోగి పిల్లల స్థానికతపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున ఉద్యోగి పిల్లలు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలను అందజేయాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Pages