S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/17/2016 - 06:22

నల్లగొండ, జూలై 16: ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని, పదవుల కోసం మూడు పార్టీలు మారిన ఆయనను సిఎం కెసిఆర్ టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకుని పెద్ద రాజకీయ పొరపాటు చేశారని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం నల్లగొండలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుత్తాపై ఆయన నిప్పులు చెరిగారు.

07/17/2016 - 06:19

మెదక్ రూరల్, జూలై 16: రెండేళ్లలో పట్టాల నిర్మాణ పనులు పూర్తిచేసి మెదక్‌కు రైలు వచ్చేలా చేస్తామని భారీ నీటిపారుదల, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం మెదక్ మండలం పాతూర్ సమీపంలో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీష్‌రావు భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.

07/17/2016 - 06:15

కొత్తూరు, జూలై 16: పచ్చని పల్లెలను నిర్మించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వృక్షాలను పెంచాలని సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పిలుపునిచ్చారు.

07/17/2016 - 06:13

హైదరాబాద్, జూలై 16: హరిత హారం కార్యక్రమంలో గిరిజన విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేయాలని గిరిజన అభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధికారులను ఆదేశించారు. పచ్చదనంలో ప్రథమ స్థానంలో నిలిచే విద్యా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు.

07/17/2016 - 06:12

చౌటుప్పల్, జూలై 16: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మం డలం దండుమల్కాపురం శివారులోని జయ లేబోరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో సుమారు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే 33 టన్నుల ము డిసామాగ్రి దగ్ధమైంది. స్టోర్ రూమ్‌లో ప్రమాదవశాత్తు మంటలు ఏర్పడి క్రమంగా వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

07/17/2016 - 06:11

కొత్తగూడెం, జూలై 16: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని పివికె-5 ఇంక్లైన్ భూగర్భగని వద్ద బోర్‌వెల్ వేసే ప్రక్రియను అధికారులు శనివారం ప్రారంభించారు. భూపాలపల్లి, సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన రెండు బోర్‌వెల్ రిగ్‌లతో పనులను మొదలుపెట్టారు.

07/17/2016 - 06:10

కొండపాక, జూలై 16: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పంట పొలాలు, నివాసాలు విడిచిపెట్టి పోవాలంటే చచ్చేంత బాధ కలుగుతోందని మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఎర్రవల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.

07/17/2016 - 06:09

నారాయణఖేడ్ జూలై 16: విద్యాబోధన నేర్పించే ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో డైట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఒక యువకుడు మన స్తాపానికి గురై చెట్టు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా ఖేడ్ మండలం తుర్కాపల్లి గ్రామ పంచాయతీలోగల గిరిజన తండాల్లో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన కుటుంబీకులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

07/17/2016 - 03:26

సంగారెడ్డి, జూలై 16: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగ యువత, మహిళా సంఘాలంతా సంఘటితంగా 42 రోజుల పాటు నిరాటకంగా నిర్వహించిన సకల జనుల సమ్మెకు ఏ మాత్రం తీసిపోకుండా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కూడా ఎక్కడి పనులు అక్కడే వదిలిపెట్టి నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు 42 రోజులు పూర్తి చేసుకున్నాయి.

07/17/2016 - 03:24

సంగారెడ్డి, జూలై 16: ఎవరి భూములకో నీరందించడానికి నీటి వనరులతో పంటలు పండించుకునే భూములను ముంపునకు గురి చేస్తూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని, ఎన్ని పోరాటాలకైనా తామంతా మీ ముందుంటామని జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Pages