S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/15/2016 - 17:24

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో అద్దెబస్సులను 2 నుంచి 23 శాతానికి పెంచడం తగదని బిజెపి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. తెలంగాణకు కేంద్రం 150 ఓల్వో బస్సులను కేటాయించిందని, టి.ఆర్టీసీలో నష్టాలను నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బిఎంఎస్‌ను గెలిపించాలని ఆయన సంస్థ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

07/15/2016 - 17:24

హైదరాబాద్: హోంగార్డుల సేవలను రెగ్యులరైజ్ చేయాలని, వారికి వేతనాలు పెంచాలని, పోలీసు అధికారుల ఇళ్లలో వారు వెట్టిచాకిరీ చేయడాన్ని అరికట్టాలని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడ తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. హోంగార్డుల చేత ఇళ్లలో వెట్టిచాకిరీ చేయించే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

07/15/2016 - 15:07

హైదరాబాద్: ఘట్‌కేసర్-శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు (నెహ్రూ ఓఆర్‌ఆర్)ను తెలంగాణ ఐటి,మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. దీంతో నగర శివారులో 158 కిలోమీటర్ల మేరకు ఓఆర్‌ఆర్ అందుబాటులోకి వచ్చింది. మంత్రులు పద్మారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్‌ఎండిఎ అధికారులు పాల్గొన్నారు.

07/15/2016 - 15:05

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్‌కు భజన చేయడంలో బిజెపి, కాంగ్రెస్ నేతలు నిమగ్నమైపోయారని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. నెంబర్ వన్ సిఎం కెసిఆర్ అని బిజెపి నేతలు పొగుడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలకు బిజెపి అవసరం ఏముంటుందన్నారు. కెసిఆర్ పథకాలపై కాంగ్రెస్ నేతలు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

07/15/2016 - 15:05

హైదరాబాద్: టీవీ నటి శ్రీవాణి శుక్రవారం ఉదయం పోలీసు స్టేషన్‌లో విచారణకు గైర్హాజరయ్యారు. రేపటిలోగా విచారణకు హాజరుకాని పక్షంలో ఆమెపై చట్టపరంగా చర్యలు తప్పవని వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నిర్మల తెలిపారు. కాగా, నటి శ్రీవాణి ఆమె వదిన అనూషపై దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్టు సిఐ తెలిపారు.

07/15/2016 - 15:03

మహబూబ్‌నగర్: గద్వాల జిల్లా సాధన సమితి కార్యకర్తలు శుక్రవారం గద్వాలలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకున్నారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు గద్వాల వచ్చిన జూపల్లిని ఆందోళనకారులు నిలదీశారు. గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించేవరకూ తాము పోరుబాట వీడేది లేదని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

07/15/2016 - 15:03

నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నరుూం ముఠాకు చెందిన సందెల సుధాకర్, పాశం శ్రీను శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ ప్రభాకర్ ఎదుట లొంగిపోయారు. నరుూంకు అనుచరుడిగా ఉన్న షకీల్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. నరుూం ముఠాలో పనిచేసిన సుధాకర్, పాశం శ్రీను, షకీల్‌పై గతంలో పోలీసులు పీడీ యాక్టు కింద కేసులు పెట్టారు.

07/15/2016 - 12:36

హైదరాబాద్: అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న హైదరాబాద్ నగరంలో రహదారుల తీరుతెన్నులు అసంతృప్తికరంగా ఉన్నాయని మున్సిపల్ మంత్రి కెటిఆర్ అన్నారు. ‘మై జిహెచ్‌ఎంసి యాప్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ, సామాన్య జనం నుంచి సిఎం వరకూ అందరూ నగర రహదారులపై అసంతృప్తి చెందుతున్నారని, ఈ విషయాన్ని అధికారులు గమనించి రోడ్లను మెరుగుపరచాలన్నారు.

07/15/2016 - 12:35

హైదరాబాద్: జనన, మరణ ధ్రువీకరణలు, ఆస్తిపన్ను, వ్యాపార లైసెన్స్‌లు వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ‘మై జిహెచ్‌ఎంసి యాప్’ను తెలంగాణ ఐటి, మున్సిపల్ మంత్రి కెటిఆర్ శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. పౌరసేవలను త్వరిత గతిన అందించేందుకు ఈ యాప్ దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించి ఫిర్యాదులను కూడా ఈ యాప్ ద్వారా అధికారులకు పంపవచ్చన్నారు.

07/15/2016 - 12:35

మహబూబ్‌నగర్: కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హర్షితకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శస్తచ్రికిత్స చేసి అవసరమైన వైద్యసేవలన్నీ అందిస్తామని తెలంగాణ వైద్య,ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. కాలేయ వ్యాధిని ఎదుర్కొంటున్న తమ కుమార్తెను కారుణ్య మరణానికి అనుమతించాలని హర్షిత తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Pages