S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

,
07/03/2016 - 05:36

జనగామ టౌన్, జూలై 2: జనగామను జిల్లాగా మార్చాలని డి మాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాలు స్తోంది. కొన్ని మాసాల నుంచి శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం మ రింత ఉద్ధృతమై హింసాత్మక సంఘటనలకు దారితీస్తోంది. ఉద్యమకారులపై లాఠీచార్జికి నిరసనగా శనివారం జిల్లా సాధన ఐకాస నిర్వహించిన బంద్ నిరసనలు, ఆందోళనలు, అరెస్టులతో ముగిసింది.

,
07/03/2016 - 05:26

మహబూబ్‌నగర్, జూలై 2: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తెరాస కార్యకర్తలు ఆయనపై దాడికి యత్నించారు.

07/03/2016 - 05:20

హైదరాబాద్, జులై 2: మజ్లిస్ పార్టీని నిషేధించి, ఆ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్.ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదులకు న్యాయ సహా యం అందిస్తామని అసదుద్దీన్ ప్రకటించడం విచారకరమని ప్రభాకర్ శనివారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.

07/03/2016 - 05:18

దామరచర్ల, జూలై 2: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామంలో కృష్ణానది సమీపంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం... కృష్ణా పుష్కరాల పనులలో భాగంగా కృష్ణానది సమీపంలో వరదలో ముంపునకు గురైన వీరభద్రుని ఆలయాన్ని పునరుద్ధరించేందుకు తవ్వకాలు జరుపుతుండగా మూడు దేవతామూర్తుల విగ్రహాలు లభ్యమయ్యాయి.

07/03/2016 - 05:15

కోరుట్ల, జూలై 2: కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు కట్ట నిర్మాణం పనుల్లో శనివారం చెరువు కట్ట కింద జరుగుతున్న తవ్వకాల్లో శ్రీరాముని విగ్రహం బయల్పడింది. దేవుడి విగ్రహం బయట పడడంతో చెరువు తవ్వకం చేపట్టిన నిర్వాహకులు వెంటనే పనులను నిలిపివేసారు. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో ప్రజలు తండోప తండాలు తరలి వచ్చి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసారు.

07/03/2016 - 05:09

మిర్యాలగూడ టౌన్, జూలై 2: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాంచంద్రగూడెం నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి మోటార్ సైకిల్‌పై 6.33 లక్షల రూపాయల బ్యాగుతో వెళ్తున్న పెట్రోల్ బంకు యజమానిపై ముసుగుదొంగలు దాడి చేసి డబ్బుబ్యాగుతో పరారయ్యారు.

07/03/2016 - 05:09

హైదరాబాద్, జూలై 2 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు దశలవారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమక్షంలో శనివారం ప్రైవేటు ఆసుపత్రుల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.

07/03/2016 - 05:08

హైదరాబాద్, జులై 2: రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరా బాద్‌లో ఉగ్రవాదులు తిష్ట వేయడానికి మజ్లిస్ పార్టీయే కారణమని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ విమర్శించారు.

07/02/2016 - 18:25

హైదరాబాద్: ఆస్తి గొడవల నేపథ్యంలో సొంత అన్నపైనే ఓ తమ్ముడు దాడి చేసి అతని గొంతుకోసిన ఘటన నగరంలోని గాంధీనగర్‌లో శనివారం జరిగింది. ఆస్తి కోసం అన్న శ్రీ్ధర్ యాదవ్, తమ్ముడు శేఖర్ యాదవ్‌ల మధ్య ఎప్పటిలాగే మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు శేఖర్ అన్న శ్రీ్ధర్ గొంతును కత్తితో కోశాడు. వెంటనే స్థానికులు జోక్యం చేసుకుని శ్రీ్ధర్‌ను ఆస్పత్రికి తరలించారు.

07/02/2016 - 18:24

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణలో న్యాయవాదులు ఆందోళన, న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు, హైకోర్టు విభజన, తాజా పరిణామాలపై ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. లాయర్ల ఆందోళనపై గవర్నర్ శుక్రవారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు కొంతమంది ప్రముఖుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Pages