S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/02/2016 - 08:36

నల్లగొండ, జూలై 1: కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా రైతాంగానికి ఒకవైపు డిండి ఎత్తిపోతలతో కృష్ణా నీరు, మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) ప్రాజెక్టుతో గోదావరి జలాలను, ఇంకోవైపు మూసీ కాల్వల విస్తరణతో సాగునీటిని అందించాలన్న ప్రభుత్వం లక్ష్యం క్రమంగా ముందడుగు వేస్తోంది.

07/02/2016 - 08:35

నిజామాబాద్, జూలై 1: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ వర్షాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ప్రాజెక్టు గేట్లను యథాతథంగా తెరిచి ఉంచనున్నారు.

07/02/2016 - 08:31

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయమై వచ్చే వారం వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయబోమని తెరాస సర్కారు హైకోర్టుకు తెలియజేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

07/02/2016 - 05:07

వరంగల్/ మహబూబ్‌నగర్, జూలై 1: దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో సర్కారు కసరత్తు చేస్తుంటే, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లాలు ఏర్పాటు తగదంటూ నిరసనలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు శుక్రవారం హింసాత్మక సంఘటనలుగా మారాయి.

07/02/2016 - 05:14

హైదరాబాద్, జూలై 1: హరితహారం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజోద్యమంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో విద్యార్థి నుంచి సిఎం వరకు అందరూ పాల్గొనాలన్నారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో హరితహారంపై సిఎం సమీక్ష నిర్వహించారు.

07/02/2016 - 04:59

హైదరాబాద్, జూలై 1: తెలంగాణలో వౌలిక వసతుల ప్రాజెక్టులకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టెందుకు మలేసియా ప్రభుత్వానికి చెందిన కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డ్(సిఐడిబి) సంసిద్ధత వ్యక్తం చేసింది. మలేషియా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం పలు కీలక సంస్థలతో సమావేశం అయ్యారు. సిఐడిబి సిఇఓ అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో సమావేశం అయ్యారు.

07/02/2016 - 04:58

హైదరాబాద్, జూలై 1: హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్లను నిరసిస్తూ సాగుతోన్న తెలంగాణ న్యాయ పోరాటం కొత్తమలుపు తిరిగింది. హైకోర్టు విభజనపై జరుగుతున్న ఆందోళన అంశంలో చొరవ తీసుకోవడం లేదనే విమర్శలకు తెరదించే ప్రయత్నం గవర్నర్ నుంచి మొదలైంది.

07/01/2016 - 18:17

హైదరాబాద్: తెలంగాణలో హరితహారం పనులపై సిఎం కెసిఆర్ శుక్రవారం ఉన్నతస్థాయిలో సమీక్ష జరిపారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున హరితహారం రెండోదశను చేపట్టి భారీసంఖ్యలో మొక్కలు నాటేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. జూలై 11తర్వాత హెచ్‌ఎండిఎ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటాలని ఆయన సూచించారు.

07/01/2016 - 18:16

హైదరాబాద్: పాతబస్తీలో పట్టుబడిన అయిదుగురు ఉగ్ర అనుమానితులను ఎన్‌ఐఎ అధికారులకు 12 రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అనుమానితుల నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు తమకు 12 రోజుల కస్టడీకి అనుమతించాలని ఎన్‌ఐఎ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న అయిదుగురు అనుమానితులను 12రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

07/01/2016 - 16:20

హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయాధికారులు వెంటనే ఆందోళన విరమించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంశే్ల శుక్రవారం కోరారు. న్యాయం కోసం కోర్టులకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని ఆందోళనకు స్వస్తిపలకాలని సూచించారు. చట్టవ్యతిరేక ఆందోళనలు, సమ్మెల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు.

Pages