S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/01/2016 - 02:59

హైదరాబాద్, జూన్ 30: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లుగా పదోన్నతికి అంతా సిద్ధమై పదిరోజులవుతున్నా కౌనె్సలింగ్ వ్యవహారం తేలక లెక్చరర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్న 382 మందిని మెరిట్ ప్రకారం ఎంపిక చేసి శాఖాపరమైన పదోన్నతుల కమిటీ 22వ తేదీన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

07/01/2016 - 02:58

హైదరాబాద్, జూన్ 30: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతుల నుంచి జీవో 123 కింద బలవంతంగా భూములను సేకరించమని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ కేసును హైకోర్ట్ధుర్మాసనం విచారించింది.

07/01/2016 - 02:58

హైదరాబాద్, జూన్ 30: మహానగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం రంగ ఐఆర్‌ఏఎస్ శాఖకు చెందిన ఎన్వీఎస్‌రెడ్డి వాస్తవానికి ఆయన గురువారం పదవీ విరమణ చేయాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆయనకు గడువు ఇవ్వటంతో వచ్చే సంవత్సరం జూన్ 30 వరకు ఆయన అదే పదవీలో కొనసాగనున్నారు.

07/01/2016 - 02:55

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ సేవలు ‘మీసేవ’ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మీసేవ ద్వారా తూనికలు, కొలతలకు సంబంధించిన ఎనిమిది సేవలు లభిస్తాయని ఈ-గవర్నెన్స్ స్పెషల్ కమిషనర్ జిటి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

06/30/2016 - 18:12

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నిక కోసం కార్మిక శాఖ కమిషనర్తో గురువారం కార్మిక నేతలు సమావేశమైయ్యారు. వచ్చె నెల 19న ఈ యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. అదేవిధంగా జులై 25, 26 తేదీల్లో పోస్టల్ ఓట్లు ఉంటాయి. ఆగస్టు 8న అధికారకంగా తుది ఫలితాలను విడుదల చేస్తామని ఆర్టీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్ వెల్లడించారు.

06/30/2016 - 17:53

హైదరాబాద్‌: ఎన్‌ఐఏ అధికారులు బుధవారం పాతబస్తీలో అరెస్ట్‌ చేసిన ఐసిస్‌ సానుభూతిపరులకు నాంపల్లి న్యాయస్థానం రెండు వారాల రిమాండ్‌ విధించింది. దీంతో ఐదుగురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ అధికారులు తెలంగాణ పోలీసుల సాయంతో బుధవారం పాతబస్తీలో 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.

06/30/2016 - 17:49

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో రిటైర్డు పోలీసు అధికారి హరీష్ చంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లగా అతని ఇంట్లో దొంగలు చొరబడి 30 తులాల బంగారు నగలు, పట్టుచీరలు, విలువైన ఎలక్ట్రానిక్ సామగ్రిని దొంగలు దోచుకున్నారు. గురువారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. హరీష్‌చంద్ర తిరిగి ఇంటికి వస్తేగానీ చోరీ ఏ మేరకు జరిగిందో చెప్పలేమని పోలీసులు అంటున్నారు.

06/30/2016 - 17:48

హైదరాబాద్: జంట నగరాల్లో ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 5 కోట్లు విడుదల చేస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి గురువారం జరిగిన సమీక్షలో తెలిపారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జరుపుతోందన్నారు. సమీక్షా సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

06/30/2016 - 17:48

హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు వ్యూహరచన చేస్తున్నట్టు కీలక సమాచారం అందడంతో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నుంచి ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. వారం రోజులపాటు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వచ్చే నెల ఆరవ తేదీ వరకూ ఎయిర్ పోర్టులోకి సందర్శకులను అనుమతించేది లేదని, అన్నిరకాల పాసులను నిలిపివేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

06/30/2016 - 15:55

హైదరాబాద్: ఓ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగుజూసింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా- దాదాపు ఆరేడు నెలల వయసున్న పాపగా గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందితే ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Pages