S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/30/2016 - 15:53

హైదరాబాద్: లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి 108వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. 22వ తేదీన ఉదయం 8 గంటలకు జరిగే దేవి అభిషేకంతో ప్రారంభమయ్యే బోనాల జాతర ఉత్సవాలు ఆగష్టు 1 వ తేదీన ఊరేగింపుతో ముగుస్తాయన్నారు.

06/30/2016 - 15:12

హైదరాబాద్: హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్ల రద్దు విషయమై ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు శుక్రవారం (జూలై 1న) ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని టి.లాయర్ల జెఎసి పిలుపునిచ్చింది.

06/30/2016 - 15:11

హైదరాబాద్: ఫీజులు తగ్గించాలని అడిగినందుకు తమ పిల్లలకు ఓ విద్యా సంస్థ టీసీలు ఇచ్చి పంపడంపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని అమృత విద్యాలయం వద్ద గురువారం నాడు విద్యార్థుల తల్లిదండ్రులు, వారికి మద్దతుగా విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

06/30/2016 - 15:11

హైదరాబాద్: హైకోర్టు విభజన జరగలేదని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ నిందించడం సరికాదని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గతంలో పలుసార్లు కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సిఎంలు హైకోర్టు విభజనపై మాట్లాడుకోకపోడం ఎవరి తప్పని ఆయన ప్రశ్నించారు. ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం వందకోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.

06/30/2016 - 15:10

హైదరాబాద్: క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న అభియోగంపై న్యాయశాఖకు చెందిన నలుగురు ఉద్యోగులపై ఉమ్మడి హైకోర్టు గురువారం నాడు సస్పెన్షన్ వేటు వేసింది. హైకోర్టు ఏర్పాటుకు, ఆంధ్రా జడ్జిల ఆప్షన్ల రద్దుకు తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

06/30/2016 - 15:09

హైదరాబాద్: సామాజిక వెబ్‌సైట్లలో బృందంగా ఏర్పడి పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు ఇక్కడి పాతబస్తీలో అరెస్టు చేసిన 11 మందిలో ఆరుగురిని విచారణ అనంతరం విడిచిపెట్టారు.

06/30/2016 - 12:15

హైదరాబాద్: ఎపి, తెలంగాణల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, మెదక్ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా రుద్రారం వద్ద వేగంగా వెళుతున్న లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మరణించగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండగా ఓ ఆటోను లారీ ఢీకొంది.

06/30/2016 - 08:09

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణలో విద్యావ్యవస్థను గాడిన పెడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకం కలిగిస్తామని చెప్పారు. నల్గొండ మినహా అన్ని జిల్లాల్లో విద్యా సమీక్షకు సమావేశాలు ఏర్పాటు చేశామని, 9335 మంది విద్యావలంటీర్లను నియమించామని అన్నారు. టాయిలెట్ల నిర్వహణకు కనీసం ప్రతి స్కూలులో ఇద్దర్ని నియమిస్తామని చెప్పారు.

06/30/2016 - 07:38

హైదరాబాద్, జూన్ 29: సింగపూర్‌లోని ఏస్టార్ (ఏజన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసర్చ్) కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారం కుదిరింది. తెలంగాణలో పరిశ్రమలు, ఐటి తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు (కెటిఆర్) సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఏస్టార్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

06/30/2016 - 07:36

హైదరాబాద్, జూన్ 29: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు, మండలాలపై సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి ఉన్న ప్రతిపాదనల మేరకు కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయని సూచనప్రాయంగా వెల్లడించారు.

Pages